SANDEEP REDDY VANGA: మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ప్రభాస్ సందీప్ ప్రయోగం..?

సందీప్ స్పిరిట్‌కు మెగాస్టార్ చిరంజీవి మూవీ కథతో రానున్న స్పిరిట్ అనటానికి లింక్ ఉంది. ఒకసారి సందీప్ సినిమాల కథలు చూస్తే, అర్జున్ రెడ్డి నిజానికి దేవదాస్ మూవీకి మరో వర్షన్ లా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 06:32 PM IST

SANDEEP REDDY VANGA: సందీప్ రెడ్డి వంగ ఆల్ టైం ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ గత చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ప్రభాస్ మూవీ స్పిరిట్ ప్లాన్ చేస్తున్నాడా? ఇదే విషయం సందీప్ రెడ్డి అన్న చెప్పిన మాటలతో రివీల్ అయ్యిందా? ఈ డౌట్లకి క్లారిటీ దొరికింది. బేసిగ్గా సందీప్ రెడ్డి వంగని సదరన్ అనురాగ్ కశ్యప్ అంటారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన అనురాగ్ కశ్యప్ గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, దేవ్ డీ సినిమాలతో బాలీవుడ్ ట్రెండే మార్చాడు.

Ram Charan: తనే నా బలం.. చరణ్ ప్రేమ కోసం అలాంటి త్యాగం..!

అచ్చంగా తనలానే సందీప్ రెడ్డి వంగ కూడా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తో ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నే మార్చేశాడు. సందీప్ స్పిరిట్‌కు మెగాస్టార్ చిరంజీవి మూవీ కథతో రానున్న స్పిరిట్ అనటానికి లింక్ ఉంది. ఒకసారి సందీప్ సినిమాల కథలు చూస్తే, అర్జున్ రెడ్డి నిజానికి దేవదాస్ మూవీకి మరో వర్షన్ లా ఉంటుంది. అక్కడ ప్రేమ భగ్నం, తనెవరినో పెళ్లిచేసుకోవటం, హీరో ప్రాస్ట్రిట్యూట్స్ వెంటపడటం, ఇలా ప్రధాన అంశాలు అవే, కాని మేకింగ్, ట్రీట్మెంట్ వేరు. ఇక యానిమల్ విషయానికొస్తే, ఇది హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ కి కొత్త వర్షన్ లా ఉంటుంది. అక్కడ తండ్రి మీద ఎటాక్ చేస్తే రివేంజ్ తీసుకునే కొడుకు స్టైల్ ని ఓ పారిశ్రామిక వెత్త ఫ్యామిలీకి అప్లై చేశాడు సందీప్.

కాబట్టి, పాత చిత్రాల్ని ప్రేరణగా తీసుకుని సందీప్ ఇలా కొత్త సినిమాలు తీస్తున్నాడు. ఇక స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. పొలిటీషియన్స్ మీద ఎటాక్ చేసే రెబల్ గా ప్రభాస్ పాత్ర ఉండబోతుందంటున్నారు. ఇది అచ్చంగా చిరు మూవీ ఎస్పీ పరశురామ్ స్టోరీలైనే. అందులో తన కింది ఆఫీసర్ ని అవినీతి కేసులో తీసేస్తాడు హీరో, తర్వాత తనే పొలిటీషియన్ గా మారటం, ఓ ఎస్పీగా ఆ రాజకీయ నాయకుడి అంగబలంతో ఫైట్ చేయటం.. ఇది మిగతా కథ కాకపోతే ఇది చిరు కెరీర్ లో స్పెషల్ మూవీ అయినా, హిట్ మాత్రం కాదు. అయినా సందీప్ కి అదే నచ్చింది. తన స్టైల్లో ఆ మూవీ కథ కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.