Sandeep Reddy Vanga: హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని డైరెక్టర్స్ లిస్ట్‌లోకి సందీప్..?

ఎందుకంటే తన మొదటి మూవీ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్. అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తే కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు యానిమల్ అంటూ మూడో మూవీతో రాబోతున్నాడు. తర్వాత స్పిరిట్, ఆ వెంటనే యానిమల్ 2. ఇప్పటికి రిలీజైన యానిమల్ ట్రైలర్ చూస్తే.. ఆ సినిమా హిట్ అనుకోవాల్సిందే.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 05:32 PM IST

Sandeep Reddy Vanga: టాలీవుడ్‌లో 13 సినిమాలు తీసినా ఒక్క ఫ్లాపు పడని డైరెక్టర్ అంటే రాజమౌళి. అన్నీ బ్లాక్ బస్టర్లే తీశాడు. ఆ విషయంలో తనకి పోటీ అనేంత కాకున్నా.. తనలానే ఫెయిల్యూర్స్ ఫేస్ చేయకుండా వెళుతోంది అనిల్ రావిపుడి మాత్రమే. అనిల్ ఏడు సినిమాలు తీశాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి. మొత్తం రెండు హ్యాట్రిక్స్ పూర్తై.. మూడో హ్యాట్రిక్‌లో మొదటి హిట్ వచ్చింది అనిల్‌కు.

SS RAJAMOULI: జక్కన్న రూట్లోనే వెళుతున్న పాన్ ఇండియా డైరెక్టర్లు..

ఇలా హ్యాట్రిక్స్ కొడుతూ, హిట్లు తప్ప ఫెల్యూర్స్ తెలియని ఈ ఇద్దరి డైరెక్టర్స్ లిస్ట్‌లో మొన్నటి వరకు కొరటాల శివ ఉండేవాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా అన్నీ వరుస హిట్లే. కాని ఆచార్య ప్లాప్ అవటంతో ఫెల్యూర్స్‌లేని డైరెక్టర్ అనే స్టాంప్ మిస్ అయ్యింది. అయితే తను ఈ లిస్ట్‌లోంచి వెళ్లినా ఈ లిస్ట్‌లోకి అడుగుపెట్టేలా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే తన మొదటి మూవీ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్. అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తే కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు యానిమల్ అంటూ మూడో మూవీతో రాబోతున్నాడు.

తర్వాత స్పిరిట్, ఆ వెంటనే యానిమల్ 2. ఇప్పటికి రిలీజైన యానిమల్ ట్రైలర్ చూస్తే.. ఆ సినిమా హిట్ అనుకోవాల్సిందే. ఆ స్థాయిలో టీజర్, సాంగ్స్, ట్రైలర్ పేలాయి. సో.. ఇది హిట్టైతే సందీప్‌కి హ్యాట్రిక్ మాత్రమే కాదు.. రాజమౌళి, అనిల్ తర్వాత ఫెయిల్యూర్స్ లేని టాలీవుడ్ దర్శకుడిగా క్రెడిట్ దక్కుతుంది.