SPIRIT: సందీప్ రెడ్డి స్పిరిట్ కథ ఆల్‌మోస్ట్ రెడీ అయ్యందన్నాడు. స్పిరిట్‌లో రెబల్ స్టార్ పోలీస్‌గా కనిపించబోతున్నాడు. ఆల్రెడీ సలార్ సక్సెస్‌తో స్వింగ్ లోఉన్న ప్రభాస్ మార్చ్ ఎండ్‌లోగా కల్కి మూవీ పూర్తి చేసి, మారుతి మూవీ వేగం కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి టైంలో స్పిరిట్ కథ పూర్తైందని సందీప్ రెడ్డి అనటంతో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్టు అక్టోబర్‌లో కాకుండా నాలుగు నెలలు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలా ఉంది.
RAM CHARAN: రామ్ చరణ్‌కి ఊహించని విడుదల.. కారణం ఆ సినిమానే..
అయితే ప్రజెంట్ స్పిరిట్‌కి సంబంధించిన కథ మాత్రమే సిద్దమైంది. క్లైమాక్స్‌తోపాటు స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం సందీప్ ఇంకా వర్కవుట్ చేసే పనిలోఉన్నాడు. ఈనెలాఖర్లోగా స్పిరిట్ కోసం ఆఫీస్‌ని ఓపెన్ చేసి, మార్చ్‌లోగా కంప్లీట్ స్క్రిన్‌ప్లేతో కలిపి స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేస్తాడట. ఏప్రిల్ నుంచే షూటింగ్ అంటున్నారు. ఏప్రిల్ ఎండ్ నుంచి స్పిరిట్ షూట్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి, యానిమల్ సీక్వెల్ కోసమే ఇలా వేగం పెంచాడనే కామెంట్స్ పెరిగాయి.
కారణం ఏదైనా స్పిరిట్ మూవీ ఏప్రిల్‌లో మొదటి షెడ్యూల్, జూన్‌లో రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అవి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీన్ల షూటింగ్ కోసం ప్లాన్ చేసిన షెడ్యూల్ అని తెలుస్తోంది. గ్రాఫిక్స్ అవసరం ఉన్న ఆసీన్లు ముందు తీస్తే, ఈలోపు సీజీ వర్క్ చేసుకోవచ్చని అలా ప్లాన్ చేశారట.