SANDEEPREDDY VANGA: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగ తీయాల్సిన స్పిరిట్ మూవీ అక్టోబర్‌లో మొదలౌతుందన్నారు. కాని డిసెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలౌతుందని సందీప్ రెడ్డి వంగ తేల్చాడు. కానీ, ఎందుకనో తన మీద బాలీవుడ్ నటులు లేదంటే టెక్నీషియన్స్ పనికట్టుకుని కామెంట్ల బురద చల్లుతున్నారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో నటించిన అదిల్ హుస్సెన్ ఇటీవల మీడియాతో మాట్లాడాడు.
MAHESH BABU-SS RAJAMOULI: బాక్సాఫీస్ వేట.. మహేష్ బాబు, రాజమౌళి టైం వచ్చేసింది
అసలు కబీర్ సింగ్‌లో ఎందుకు నటించానా అని బాధపడ్డానని చెప్పాడు. దీనికి సందీప్ కౌంటర్ ఇచ్చాడు. 30 సినిమాలు చేసినా రాని గుర్తింపు తన కబీర్ సింగ్ వల్లే వచ్చిందన్నాడు. అదిల్‌ను అత్యాశపరుడిగా వర్ణించాడు. అయితే.. సందీప్ రెడ్డి వంగ అనవసరంగా తన మీద వచ్చే ప్రతీ కామెంట్స్‌కి రియాక్ట్ అవుతున్నాడనంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇలా రియాక్ట్ అవుతూ పోతే కామెంట్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. కాబట్టి అరిచే వాళ్లను కరిచే పని చేయకుండా, ఫ్యూచర్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టమని సలహాలిస్తున్నారు. సోషల్ మీడియాలో బాలీవుడ్‌ని నెటిజన్స్ ఆటాడుకోవటంతో సీన్ మారింది. సౌత్ ఇండియా నుంచి ఒకరొచ్చి బాలీవుడ్‌ని ఏలితే నార్త్ ఇండియా నటులు, టెక్నీషియన్స్ తట్టుకోలేకపోతున్నారనే కామెంట్స్‌తో నెటిజన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పడు సందీప్ రెడ్డి వంగకి ప్రొటెక్షన్ ఫోర్స్‌గా మారారు. తమ అభిమాన హీరోతో స్పిరిట్ తీయబోతున్నాడు కాబట్టి, ఇప్పడు సందీప్ బాధ్యత తాము తీసుకున్నట్టున్నారు. అదిల్ హుస్సేన్‌తోపాటు సందీప్ మీద కామెంట్లు చేసిన మిగతా బాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ మీద ట్వీట్ల వార్ షురూ చేశారు.