Sankranthi: టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్.. క్యూ కడుతున్న సినిమాలు..!

ఓవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు కొత్త సినిమాలు.. ఫ్యాన్స్, ప్రేక్షకులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే.. ఇప్పటిదాకా సంక్రాంతి సీజన్లు ఒకలా జరిగితే.. ఈసారి రాబోయే సంక్రాంతి విషయంలో మాత్రం చాలా గందరగోళం మొదలైంది.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 09:14 PM IST

Sankranthi: ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ కలెక్షన్ల సీజన్. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా లక్‌ను పరీక్షించుకునేందుకు వచ్చేస్తుంటారు. మరీ ముఖ్యంగా బిగ్ స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు కొత్త సినిమాలు.. ఫ్యాన్స్, ప్రేక్షకులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే.. ఇప్పటిదాకా సంక్రాంతి సీజన్లు ఒకలా జరిగితే.. ఈసారి రాబోయే సంక్రాంతి విషయంలో మాత్రం చాలా గందరగోళం మొదలైంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ డేట్స్‌ని లాక్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఆల్రెడీ ముందు నుంచి రేసులో ఉన్న సినిమాలు కాకుండా.. కొత్తగా ఇంకొన్ని యాడ్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్‌ల సినిమా గుంటూరు కారం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అలాగే ప్రభాస్-నాగ్ అశ్విన్‌ల భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ విడుదల కూడా సంక్రాంతికే అని తేల్చేశారు. మరోవైపు మాస్ మహారాజా రవితేజ ఈగల్ అంటూ సంక్రాంతి సీజన్‌పై కన్నేశాడు. అక్కినేని నాగార్జున నా సామిరంగ అంటూ పొంగల్ పోరుకు దిగుతున్నాడు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్’ సంక్రాంతికి వచ్చేస్తోంది. అయితే ఇప్పుడు వీరితో రౌడీ హీరో విజయ్ దేవరకొండ జాయిన్ అయ్యాడు.

అయితే.. వీటిలో కొన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. సో.. అప్పటికి వచ్చేవి ఏవో తెలియదు. డిసెంబర్‌లో సలార్ వస్తే గనక.. వెంకటేష్ సైంధవ్, నాని హాయ్ నాన్న సినిమాలు కూడా సంక్రాంతి వైపు అడుగులు వేసే అవకాశం లేకపోలేదు. సో.. 2024 సంక్రాంతి ఎలా ఉండబోతుందో చూడాలి.