Tollywood Sankranthi: తెలుగు ప్రజలకు సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, పిండివంటలు, కోడిపందాలతో పాటు కొత్త సినిమాలూ కంపల్సరీ. అందుకే సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈసారి సంక్రాంతి సినిమాల పోరు ఓ రేంజ్‌లో జరిగింది. భారీ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద బాగానే పోటీ పడ్డాయి. ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ సినిమాలు పొంగల్ బరిలో సందడి చేస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఇలా నాలుగు సినిమాలు ఉండే సరికి ఏకంగా థియేటర్ల కేటాయింపు కష్టమైంది. కొన్ని చోట్ల సినిమాలకు డిమాండ్ ఉన్నా థియేటర్లు తక్కువైన పరిస్థితి వచ్చింది.
Allu Arjun: స్టార్ పని మనిషి.. అల్లు అర్జున్ పని మనిషి ఇన్‌స్టా ఫాలోయింగ్ చూశారా..?
అయితే, మరి.. ఇప్పుడు సంక్రాంతి సందడి కాస్తా సద్దుమణుగుతోంది కాబట్టి.. వచ్చే సంవత్సరం సంక్రాంతి పోరు గురించి ఇప్పటి నుంచే చర్చ మొదలైపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఈ ఏడాది పరిస్థితే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. 2025 సంక్రాంతి సీజన్‌పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేసేశాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో వచ్చే పొంగల్ పోరు అంతకు మించి అన్న రేంజ్‌లో ఉండబోతోదన్న టాక్ ఫిల్మ్ లవర్స్‌కు మాంచి కిక్‌ను ఇస్తోంది. 2025 సంక్రాంతి బరిలోని కొన్ని పెద్ద సినిమాలు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషియో ఫాంటసీగా రానున్న మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక.. ప్రతీ సంక్రాంతికి ఓ సూపర్ హీరో మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నానని హను-మాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అలాగే, హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి, వచ్చే ఏడాది సంక్రాంతికి అధీర.. లేకపోతే ‘జై హనుమాన్’ పోటీలో ఉండే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా తనకు కలిసి వచ్చిన శతమానం భవతి 2ని తీసుకురాబోతోన్నాడు.
ఇక నాగార్జున కూడా ‘బంగార్రాజు’ సీక్వెల్‌ను 2025 సంక్రాంతికి తెచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా సైతం వచ్చే పొంగల్ రేస్‌లో నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 2025 పొంగల్ మూవీ రేస్ చూస్తుంటే 2017 సంక్రాంతి రేసు గుర్తొస్తుందంటున్నారు పరిశీలకులు. ఆ ఏడాది కూడా చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘శతమానం భవతి’ విడుదలయ్యాయి. ఈ మూడూ కూడా హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు 2025 సంక్రాంతి పోరులో ‘విశ్వంభర’, ‘శతమానం భవతి-2’తో పాటు బాలయ్య సినిమా కూడా నిలిస్తే.. 2017 వార్ రిపీట్ అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో.. రిజల్ట్ కూడా అలాగే రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా ఏర్పడింది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే సంక్రాంతికి అభిమానులకు ఫుల్ మీల్స్ కంపల్సరీ అని అర్థమైపోతోంది. ఈ లిస్టులో మరికొన్ని సినిమాలు కూడా యాడ్ అయితే ఇక అభిమానులకు పండగే పండగ అని చెప్పుకోవచ్చు.