HANUMAN: కొన్ని సార్లు ఏనుగులు కూడా చీమలతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతో బలమున్న ఏనుగు కూడా నీటిలో మొసలితో తలపడితే.. మొసలిదే పైచేయి అవుతుందంటారు. ఇలాంటి పరిస్థితే ఏనుగు వర్సెస్ చీమలకు వస్తుంది. అలాంటి ఏనుగే త్రివిక్రమ్ శ్రీనివాస్. చీమలా సైజులో చిన్న అయినా మార్కెట్ సైజు పెంచుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే టగ్గాఫ్ వార్. ఒకరు పెద్ద హీరోతో బ్లాక్ బస్టర్లు తీసే మాటల మాంత్రికుడు.
GUNTUR KAARAM: మహేశ్ మూవీ మీద ఫైర్ అవుతున్న ప్రభాస్, పవన్ ఫ్యాన్స్
అనుభవజ్ఞుడు. మరొకరుచిన్న సినిమాలతో వరుసగా హిట్లు కొడుతూ హనుమాన్ అంటూ పాన్ ఇండియా లెవల్లో దూసుకెళ్లే దర్శకుడు. ఇద్దరి మధ్య పోటీ ఎందుకంటే, గుంటూరు కారం.. హనుమాన్ మూవీని తొక్కేస్తుందనే కోణంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద సానుభూతి ఉంది. హనుమాన్ లాంటి డివోషనల్ కంటెంట్‌కి నార్త్‌లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది కథ కాస్త క్వాలిటీ ఉన్న కాంతారా, కార్తికేయ 2 ఎలా కలెక్షన్స్ రాబట్టాయో చూశాం. కాబట్టే హనుమాన్ మూవీ ఏమాత్రం హిట్టై భారీగా పుంచుకున్నా, గుంటూరు కారం ఏమాత్రం స్లో అయినా ఓ లోబడ్జెట్ మూవీ.. హై బడ్జెట్ సినిమానే మింగేసే ఛాన్స్ ఉంది. ఇక సైంధవ శనివారం వస్తుంటే, ఆదివారం నా సామిరంగ రాబోతోంది.
హిట్ 1, హిట్ 2 తో వరుస విజయాలు అందుకున్న శైలేష్, ఇప్పడు మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్న విజయ్ బిన్నీతోపోటీ పడాల్సి వస్తోంది. అసలే వెంకీ కెరీర్‌లో 75వ మూవీగా సైంధవ్ సందడి మొదలైతే, దానికి పోటీకి మరుసటి రోజు నాసామిరంగ దాడి. మరి వీటన్నింటి మధ్య ఏ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.