SANKRANTHI MOVIES: సంక్రాంతి సినిమాలకు దిల్ రాజు బంపర్ ఆఫర్ కూడా పనిచేయట్లేదా..?

విచిత్రం ఏంటంటే ఈనెల 12, 13, 14 నే ఐదు సినిమాలు పోటీ పడే బదులు, రోజుకి రెండు కాకుండా ఒకటి చొప్పున వస్తే, థియేటర్ల సర్ధుబాటుకి ఛాన్స్ ఉంది. 11న అంటే గురువారం ఏదో ఒక మూవీ విడుదల ప్లాన్ చేసుకుంటే, థియేటర్ల సమస్య కనీసం ఓపెనింగ్స్ రోజైనా తీరుతుందనే అభిప్రాయం ఉంది.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 08:40 PM IST

SANKRANTHI MOVIES: సంక్రాంతికి తెలుగులో భారీ సినిమాలు రాబోతున్నాయి. జనవరి 12న గుంటూరు కారం రాబోతోంది. అదే రోజు హనుమాన్ మూవీ రాక కన్ఫామ్ అయ్యింది. పోటీలో పెద్ద హీరో ఉన్నాసరే.. అదే రోజు రిలీజ్ పెట్టుకోవటానికి నార్త్ మార్కెట్టే కారణమంటోంది హనుమాన్ టీం. ఇక 13న వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీతో, రవితేజ ఈగల్ పోటీ పడబోతోంది. 14న నా సామిరంగ రానుంది.

TOLLYWOOD: పెళ్లిళ్ల నామ సంవత్సరం.. టాలీవుడ్‌లో ఈ ఏడాది పెళ్లి చేసుకోబోయేదెవరు..?

విచిత్రం ఏంటంటే ఈనెల 12, 13, 14 నే ఐదు సినిమాలు పోటీ పడే బదులు, రోజుకి రెండు కాకుండా ఒకటి చొప్పున వస్తే, థియేటర్ల సర్ధుబాటుకి ఛాన్స్ ఉంది. 11న అంటే గురువారం ఏదో ఒక మూవీ విడుదల ప్లాన్ చేసుకుంటే, థియేటర్ల సమస్య కనీసం ఓపెనింగ్స్ రోజైనా తీరుతుందనే అభిప్రాయం ఉంది. గుంటూరు కారం నిర్మాత అయితే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని, ఫ్యాన్స్ కంగారు పడొద్దని అంటాడు. సైంధవ్ మూవీ వెంకీ కెరీర్‌లో 75వ సినిమా కాబట్టే.. సురేష్ బాబు ఈ మూవీకోసం ఎక్కువ థియేటర్స్‌ని ఎంగేజ్ చేస్తున్నాడని తెలుస్తోంది.

హనుమాన్ 12న తప్ప మరో డేట్‌కి నో అంటోంది. ఈగల్, నాసామిరంగ టీంలు కూడా వెనక్కి తగ్గనంటున్నాయి. కనీసం ఓపెనింగ్స్ అయినా చీలీపోకుండా ఉండాలంటే పండక్కి ఎవరో ఒకరు తగ్గక తప్పదు. అలా తగ్గితే, ఎక్కువ థియేటర్స్ ఇచ్చేలా చేస్తా అని దిల్ రాజు ప్రామిస్ చేసినా పట్టించుకునే నాథుడే లేడట.