సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ

విలక్షణ సినిమాల కోసం కొంత కాలంగా కష్టపడుతున్న నానీ... ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్జే సూర్య కనిపించాడు.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 08:23 AM IST

విలక్షణ సినిమాల కోసం కొంత కాలంగా కష్టపడుతున్న నానీ… ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్జే సూర్య కనిపించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది…? సినిమా ఆకట్టుకుందా అనేది ఒకసారి ట్విట్టర్ రివ్యూ చూస్తే…

నానీ కంటే ముందు విలన్ ఎస్జే సూర్య గురించి మాట్లాడుతున్నారు ప్రేక్షకులు. తన నటనతో సినిమాకు హైప్ తెచ్చాడు సూర్య. అతని సీన్స్ అన్నీ కూడా దాదాపుగా ప్రేక్షకులకు నచ్చేసాయి. ఇక ఇంటర్వెల్ సీన్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టైటిల్‌ ను జస్టిఫై చేసే ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే సినిమా కాస్త లాగ్ ఉన్నట్టుగా అనిపించింది ఫస్ట్ హాఫ్. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం లాగ్ లేకుండా సెట్ చేసాడు డైరెక్టర్. యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. ఎమోషన్ కూడా సినిమాలో బాగా చూపించారు.

అయితే తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు అర్ధమైపోవడం సినిమాకు మైనస్ అయిందనే చెప్పాలి. నాని, ఎస్‌జె సూర్య మధ్య ఇంట్రడక్షన్ బ్లాక్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్, ఇద్దరి మధ్య కొన్ని యాక్షన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా మధ్యలో కాస్త బోర్ కొడుతుంది. ఇక స్క్రీన్ ప్లే మీద వర్క్ చేసి ఉండాల్సింది. చిన్న చిన్న తప్పులతో సినిమా పెద్దది అనే ఫీల్ వచ్చింది ప్రేక్షకులకు. క్యారెక్టరైజేషన్స్ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఎస్జే సూర్య పాత్ర సినిమాకు హైలెట్. అతని సెలెక్షన్ తో దర్శకుడు మంచి పని చేసాడు. అతని నడక, నటన అన్నీ బాగా ఆకట్టుకున్నాయి.

ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్ లో దుమ్ము రేపింది అనే చెప్పాలి. కొన్ని కొన్ని పొరపాట్లు ఉన్నా సరే సినిమా మాత్రం బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఒకసారి చూడవచ్చు అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. దర్శకుడు మాత్రం తన రెగ్యులర్ జోన్ నుంచి బయటకు వచ్చేసాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడు కాని యాక్షన్ డ్రామా మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. కామెడి అంతగా లేకపోవడం మైనస్ అయింది. కథ బాగుంది కాని కాస్త వర్కౌట్ చేసి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది. ఓవరాల్ గా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.