2024 కి ఎండ్ కార్డ్ పడే టైం వచ్చింది. మరో మూడు వారాల్లో ఈ ఇయర్ కి గుడ్ బై చెప్ప 2025లో అడుగుపెట్టబోతున్నాం…. ఐతే గూగుల్ తల్లి ఈలోపు ఇయర్ ఎండ్ రికార్డ్స్ ని ఎనౌన్స్ చేసింది. ఆ లిస్ట్ చూస్తే ముందుగా కనిపించిన రికార్డు రెబల్ స్టార్ ప్రభాస్ పేరుతోనే ఉంది. ఒకటి కాదు రెండు రికార్డులు రెబల్ స్టార్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. తర్వాత స్థానంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ ఇద్దరి గురించి మూడు అంశాల్లో జనాలు తెగ వెతికారట… గూగుల్ సెర్చ్ లో ఈ ఏడాది వరల్డ్ వైడ్ గా సెర్చ్ చేసిన సెలబ్రిటీలు, టాపిక్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నారు. వీల్లతో పాటు ఇంకా ఎనిమిది మంది పేర్లు గూగుల్ లో మారుమోగాయి… ముగ్గురి కోసం మూడు వేల కోట్ల వెతుకులాట అంటూ ఓన్యూస్ వైరలౌతోంది… అదేంటో చూసేయండి.
ఈ ఏడాది గూగల్ సెర్చ్ లో ఎక్కువగా ఎవరిని వెతికారన్న లిస్ట్ వచ్చేసింది. నిజానికి హిందీ మూవీ స్త్రీ 2 తాలూకు అప్ డేట్లు, వసూళ్ల డిటేల్స్ ని వెతికారని, ఆరకంగా అది ఇండియా నెం.1 గా నిలిచిందన్నారు. కాని తీరా చూస్తే ఓన్లీ నార్త్ ఇండియాలోనే స్త్రీ 2 కోసం వెతికిన వారి సంఖ్య ఎక్కువ..ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరిని ఎక్కువగా సెర్చ్ ,చేశారు.. ఎవరి వార్తలు ఎక్కువ వెతికారో లిస్ట్ చూస్తే, షాకింగ్ గా రెబల్ స్టార్ ప్రభాస్ పేరే మారుమోగుతోంది
నార్త్ ఇండియన్స్ సంఖ్య ఎక్కువ కాబట్టి, వాళ్లు హిందీ సినిమాలను వెతికితే, ఆటోమేటిగ్గా ఇండియా మొత్తంలో ఎవరు ఎక్కువ గూగుల్ లో ఎవరిని సెర్చ్ చేశారనే లిస్ట్ లో స్త్రీ 2 మూవీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కాని యూఎస్, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్ తో పాటు చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీలో సెటిలైన ఇండియన్స్ తాలూకు బ్రౌజింగ్ లెక్కలు చూస్తే వరల్డ్ వైడ్ గా రెబల్ స్టార్ గురించి వెతికిన ఇండియన్స్ లెక్కల్లో రెబల్ స్టారే ఇండియా నెంబర్ వన్.
తన సినిమా సలార్ తోపాటు కల్కీ తాలూకు సెర్చ్ లు ఈ ఏడాది భారీగా జరగాయి. అందుకే ఇండియా నెంబర్ వన్ మాత్రమే కాదు. వరల్డ్ వైడ్ గా గూగుల్ లో భారీగా సెర్చ్ చేసిన హీరోలు, సినిమాలు లిస్ట్ లో ప్రభాస నెంబ 9 ప్లేస్ లో ఉన్నాడు. అంటే వరల్డ్ టాప్ టెన్ లో ప్రభాస్ పేరుండేంతగా, తన మీద గూగల్ లో సెర్చ్ లు జరిగాయని తేలింది.
ఇక గూగుల్ లో జనాలు ఎక్కువగా వెతికిన అంశాలు, స్టార్ల లిస్ట్ లో నెంబర్ 2 ప్లేస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నాడు.. విచిత్రం ఏంటంటే సౌత్ కంటే నార్త్ ఇండియాలోనే ఎన్టీఆర్ మీద గూగుల్ లో సెర్చ్ చేశారట.
తన దేవర మూవీతో ప్యార్ లల్ గా వార్ 2 షూటింగ్ అప్ డేట్స్ మీద భారీగా సెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. థర్డ్ ప్లేస్ లో స్ట్రీ 2 ఉండగా, నాలుగో స్థానంలో హనుమాన్ మూవీ ఉంది. మొత్తంగా ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా వెతికింది ఇండియన్స్ పరంగా చూస్తే ప్రభాస్ సలార్, కల్కీ, ఎన్టీఆర్ దేవర, వార్ 2 షూటింగ్ అప్ డేట్స్, స్త్రీ 2 కలెక్షన్స్ అలానే హనుమాన్ అప్ డేట్స్ ఇవే ఇండియా టాప్ ఫైవ్ సినీ అంశాలు..