పాన్ ఇండియా కింగ్ నెం.1, నెం.2… అచ్చుగుద్దినట్టు ఇద్దరి రహస్యం..

పాన్ ఇండియా మార్కెట్ లో ఏ హీరో వరుసగా హిట్లు సొంతం చేసుకుంటున్నా, వాళ్లని రెబల్ స్టార్ తో పోల్చక తప్పదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. కాకపోతే పోల్చటం వల్ల కాదు కాని, చాలా విషయంలో రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ మద్య పోలికలు షాక్ ఇస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 02:25 PM IST

పాన్ ఇండియా మార్కెట్ లో ఏ హీరో వరుసగా హిట్లు సొంతం చేసుకుంటున్నా, వాళ్లని రెబల్ స్టార్ తో పోల్చక తప్పదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. కాకపోతే పోల్చటం వల్ల కాదు కాని, చాలా విషయంలో రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ మద్య పోలికలు షాక్ ఇస్తున్నాయి. మొదటి పాన్ ఇండియా హిట్, తర్వాత వచ్చిన హిట్, ఆ వెంటనే బాలీవుడ్ మీద దండయాత్ర, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా.. అన్నీ ప్రభాస్ వేసిన అడుగుల్లానే ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయి. ఇది పక్కా కో ఇన్స్ డెన్సే… కాని రెబల్ స్టార్ లానే మ్యాన్ ఆఫ్ మాసెస్ వేసే అడుగులు పడొచ్చు .. కాని సక్సెస్ తో పాటు మార్కెట్ లో మార్పు ఇవన్నీ అచ్చంగా అలానే ఎలా జరుగుతున్నాయి… ఈ మాస్ మ్యాజిక్ వెనకున్న లాజికేంటి?

పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే.. అలా అనిపించుకునేందుకు తనకి 9 ఏళ్ల టైం పట్టింది. బాహబలి ది బిగినింగ్, బాహుబలి దికన్ క్లూజన్, సాహో,సలార్, కల్కీ ఇలా 5 పాన్ ఇండియా హిట్స్ తో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు. కట్ చేస్తే ఆతర్వాత పాన్ ఇండియా సెకండ్ కింగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీర్ అనిపించుకుంటున్నాడు.

అంతవరకు బానే ఉంది కాని, ఎన్టీఆర్ పాన్ ఇండియా కెరీర్ అచ్చుగుద్దినట్టు రెబల్ స్టార్ లానే ఉంది.. అదే కాస్త్ స్ట్రేంజ్ గా అనిపిస్తోంది. సరే రెబల్ స్టార్ దారిలోనే ఎన్టీఆర్ నడిచాడే అనుకుందాం.. అయినంత మాత్రాన రిజల్ట్ తోపాటు తన సినిమా ప్లానింగ్ కూడా అలా ఎలా
సింక్ అవుతుంది…

అక్కడే కోఇన్స్ డెన్స్ అందరికి మైండ్ బ్లాక్ చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా కెరీర్ ని అబ్ జర్వ్ చేస్తే, బాహుబలి రెండు భాగాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు

రాజమౌళి మేకింగ్ లో త్రిబుల్ ఆర్ తోనే ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సౌత్ కంటే బాలీవుడ్ లోనే భారీగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ మూవీ దేవర సౌత్ లో ఎంత బాగా వసూళ్లురాబట్టినా, నార్త్ లో అందుకు రెట్టింపు రాబట్టింది.

ఇక బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హిందీ మూవీ ఆదిపురుష్ కి కమిటయ్యాకే రాధే శ్యామ్ చేశాడు. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మూవీలు త్రిబుల్ ఆర్, దేవర తర్వాతే వార్ 2 అంటూ హిందీ సినిమాకు కమిటయ్యాడు. షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే హిందీ మూవీ ఆది పురుష్ తర్వాతే ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేశాడు ప్రభాస్…

రాదేశ్యామ్, ఆదిపురుష్ తో పాటు సలార్ ప్యార్ లల్ గా తెరకెక్కింది. కట్ చేస్తే త్రిబుల్ ఆర్, దేవర తర్వాత వార్ 2 తో హిందీ బాటల వెలుతూ, ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు తారక్… అచ్చుగుద్దినట్టు, పాన్ ఇండియా హిట్లు, తర్వాత బాలీవుడ్ ఎంట్రీ, వెంటనే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో మూవీ.. ఇవన్నీ సింక్ అవటమే కాదు, సక్సెస్ రేటు, నార్త్ ఇండియన్ మాస్ లో ఫ్యాన్ బేసు కూడా భారీగా పెరగటం, అన్నీ ఒకేలా జరుగుతున్నాయి. కాబ్టట్టే పుష్ప హిట్ అయినా చరన్ గ్లోబల్ స్టారైనా, పాన్ ఇండియా లెవల్లో మొదటి కింగ్ ప్రభాస్ అయితే రెండో కింగ్ మ్యాన్ ఆఫ్ మాసెసే అని కన్ఫామ్ అయిపోయింది. లెక్కలు చూస్తే అదే తెలుస్తోంది.