కారవాన్ లో సీక్రెట్ కెమెరా, సీనియర్ నటి సంచలన కామెంట్స్

కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు కేవలం అక్కడ మాత్రమే పరిమితం కాలేదు. సౌత్ తో పాటుగా అటు బాలీవుడ్ లో సైతం ఆందోళన కలిగిస్తోంది. మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో ఒక్కసారిగా సినిమా నటుల్లో భయం మొదలయింది.

  • Written By:
  • Publish Date - August 31, 2024 / 01:34 PM IST

కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు కేవలం అక్కడ మాత్రమే పరిమితం కాలేదు. సౌత్ తో పాటుగా అటు బాలీవుడ్ లో సైతం ఆందోళన కలిగిస్తోంది. మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో ఒక్కసారిగా సినిమా నటుల్లో భయం మొదలయింది. ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలో సైతం వేధింపులు ఉన్నాయని సీనియర్ నటి, నిర్మాత కుట్టి పద్మినీ వ్యాఖ్యలు చేసారు. కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా సీనియర్ నటి రాధిక ఈ రిపోర్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం అనేది బాధాకరం అన్న ఆమె… 46 ఏళ్ళ నుంచి తాను ఈ పరిశ్రమలో ఉన్నా అని అన్ని చోట్లా ఇదే విధమైన సమస్యలు మహిళలకు ఎదురు అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఒక సినిమా షూట్ కోసం తాను కేరళ వెళ్ళినప్పుడు ఎదురైన ఒక ఘటన ఎప్పటికీ మర్చిపోలేను అని… తాను షాట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళే సమయంలో సెట్ లో కొందరు మగాళ్ళు కూర్చుని ఫోన్ లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారని అన్నారు.

వాళ్ళు వీడియో చూస్తున్నారని అర్ధమైందని… ఆ తర్వాత ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారని అడిగితే… కారవాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు షూట్ చేసి వాటిని ఫోన్ లో చూస్తున్నారని తనకు అర్ధమైందని… కారవాన్ లో ఏమైనా కెమెరాలు పెడితే మాత్రం కచ్చితంగా బుద్ధి చెప్తా అని ఆ టీం కి తాను వార్నింగ్ ఇచ్చినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తర్వాత తనకు కారవాన్ వాడాలంటేనే భయం పట్టుకుందని ఆమె చెప్పుకొచ్చారు. కారవాన్ అనేది హీరోయిన్లకు చాలా అవసరం అని… అలాంటి చోటున కూడా ఆ విధంగా చేయడం తనను భయపెట్టిందని అన్నారు.