బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వానికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. జత్వానితో కలిసి మహిళా సంఘాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసాయి. జత్వానీ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అక్రమంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా జత్వాని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం హయాంలో తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో కొందరు ఐపీఎస్ అధికారులు నీచంగా ప్రవర్తించారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఓ మహిళ పట్ల అలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యగా ఆమె అభివర్ణించారు. నా క్యారెక్టర్ ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు అని సాక్షి మీడియా నా వ్యక్తిత్వాన్ని కించపర్చుతోంది..సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు పంపించాను అన్నారు.
కుక్కల విద్యాసాగర్ పై 2015 వరకే 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి..నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు అని ఆమె స్పష్టం చేసారు. కుక్కల విద్యాసాగర్ తనను బ్లాక్ మెయిల్ చేశాడు అని హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్లు దారుణంగా ప్రవర్తించారు అని వాపోయారు జత్వాని. దుబాయ్ లో ఉన్న నా సోదరుడిని కూడా ఇబ్బంది పెట్టారు అని తన అనుభవాలను వివరించారు. తనను ఒక ఉగ్రవాదిలా చూసారు అంటూ ఆమె వాపోయారు.