నాటి చలనచిత్ర రంగంలో నేపాల మాంత్రికుడు ఎస్వీ రంగారావు అత్యంత శక్తిమంతుడు కాబట్టే తోటరాముడు ఎన్టీఆర్ పాతాళ భైరవి సినిమాలో ఎలివేట్ అయ్యాడు. తాజాగా రావణ వేషధారి సైఫ్ అలీ ఖాన్ ని పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసారు కాబట్టే రాముడు పాత్రధారి ప్రభాస్ ఆదిపురుష్ గా ఆకట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో హీరోల పేమెంట్ లు ఆకాశాన్ని అంటున్నాయి అని మనకు తెలుసు. అయితే పవర్ఫుల్ విలన్ ల పారితోషకాల సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకాష్ రాజ్ ఒక చిత్రానికి కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్నాడు. పుష్ప 2 కోసం ఫహద్ ఫాజిల్ 6 కోట్లు వసూలు చేసాడు. ఆదిపురుష్ కోసం సైఫ్ అలీ ఖాన్ 10 కోట్లు డిమాండ్ చేసాడు. జవాన్ చిత్రం క్లో విలన్ గా చేసినందుకు విజయ్ సేతుపతి 21 కోట్లు వసూలు చేసాడు. ప్రాజెక్ట్ కే సినిమా లో విలన్ గా చెయ్యడం కోసం కమలహాసన్ ఏకంగా 25 కోట్లు తీసుకుంటూ విలనా మజాకానా అనిపిస్తున్నాడు. మరి ఈ పవర్ఫుల్ విలన్లు ఆడియన్స్ ని ఆకట్టుకుంటే ఆ సినిమాలకు తిరుగే ఉండదు. ఏం చేస్తారో సినిమా విడుదల అయ్యే వరకూ వేచిచూద్దాం.