ఏదేమైనా ఈ మధ్య కాలంలో మన తెలుగు డైరెక్టర్ లు తెలుగు భాష కంటే ఇతర భాషల మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. స్టార్ హీరోలకు ఇక్కడ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండటంతో ఎలా ఉన్నా సినిమా చూస్తారు అనే ధీమాతో ఇతర భాషల మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు బాలీవుడ్ తో పాటుగా ఇతర సౌత్ భాషల్లో డిమాండ్ పెరిగిన మాట వాస్తవం. ప్రభాస్ సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనే మాట నిజం.
అయితే ఇప్పుడు ప్రభాస్ ఓ మార్కెట్ విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడట. కేరళలో ప్రభాస్ సినిమాలు అంతగా ఆడటం లేదనే పేరు ఉంది. అందుకే ఇప్పుడు ఆ మార్కెట్ మీద ఫోకస్ పెడుతున్నాడని టాక్. స్పిరిట్ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫోకస్ కేరళ అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాలో ప్రభాస్ కు తండ్రి పాత్రకు గానూ మమ్ముట్టిని తీసుకోవాలని భావిస్తున్నాడు సందీప్ రెడ్డి. ఆయనకు మన తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన్ను తీసుకుంటే తమిళంలో కూడా సినిమాకు మంచి ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది.
అందుకే ఇప్పుడు మమ్ముట్టి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు సందీప్ రెడ్డి. ప్రభాస్ హైట్ కి ఆయన హైట్ కి కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నాడు సందీప్ రెడ్డి. ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరిపారని, ఆయన షూట్ మొత్తం ముంబైలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా రానుంది. సందీప్ రెడ్డి వంగాకు హిందీలో కూడా యానిమల్ సినిమాతో మార్కెట్ పెరిగింది. ఒక్క కేరళ మీదనే ప్రభాస్ కు కూడా కాస్తో కూస్తో ఆలోచన ఉంది. అందుకే కేరళ మార్కెట్ పై గట్టిగా గురిపెట్టే ప్లాన్ మొదలుపెట్టారు.