ప్రసాద్‌ బెహరా కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

యూట్యూబ్‌ ఫేం ప్రసాద్‌ బెహరాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అది కూడా సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ కేసులో. తనతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్న హీరోయిన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ హీరోయిన్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు పెట్టింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 06:15 PM IST

యూట్యూబ్‌ ఫేం ప్రసాద్‌ బెహరాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అది కూడా సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ కేసులో. తనతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్న హీరోయిన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ హీరోయిన్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు పెట్టింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. కొంత కాలంగా వరుస వెబ్‌ సిరీస్‌లతో ప్రసాద్‌ బెహరా మంచి పేరు సంపాదించుకున్నాడు. నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా వచ్చిన కమిటీ కుర్రోళ్లు సినిమాలో కూడా కీ రోల్‌ ప్లే చేశాడు ప్రసాద్‌. అతని యాక్టింగ్‌కి, కామెడీకి, టైమింగ్‌కి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆడియన్స్‌ అంత ఆదరిస్తే.. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న టైంలో ప్రసాద్‌ మాత్రం దాన్ని మిస్‌ యూజ్‌ చేసుకున్నాడు. తనకున్న ఫేంను అడ్డుపెట్టుకుని యువతిని వేధించడం మొదలు పెట్టాడు.

అది కూడా తనతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్న సాటి హీరోయిన్‌ని. షూటింగ్‌ సమయంలో యువతిని ఇష్టం వచ్చినట్టు తాకడం, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరించడం చేశాడు. అప్పటికే చాలా ప్రాజెక్ట్‌లు చేసిన అనుభవం ఉండటంతో ఇండస్ట్రీలో తనకు ఎవరూ ఎదురు చెప్పరు అన్న పొగరుతో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఇది నిన్నా మొన్నా జరిగిన వ్యవహారం కాదని చెప్తోంది ప్రసాద్‌ మీద కేసు పెట్టిన హీరోయిన్‌. చాలా కాలంగా ఇదే తీరుగా ఆ హీరోయిన్‌ను వేధిస్తున్నాడట ప్రసాద్‌. ఇదే విషయాన్ని సినిమా ప్రొడక్షన్‌ హౌజ్‌ దృష్టికి తీసుకువెళ్లినా.. వాళ్ల నుంచి పెద్దగా రెస్పాన్స్‌ లేదట. దీంతో తానే ప్రసాద్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్‌ అయ్యింది ఆ హీరోయిన్‌. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి లోపలేశారు పోలీసులు. ఇన్నాళ్లు చేసిన వెబ్‌సిరీస్‌లు సంపాదించుకున్న పేరు.. మొత్తం ఒక్క కేసుతో పోయింది. యాక్టర్‌గా తెచ్చుకున్న మంచి గుర్తింపును తన చేతులతో తానే పాడు చేసుకుని.. ఇప్పుడు ఉమెనైజర్‌ అనే ముద్ర వేసుకున్నాడు ప్రసాద్‌ బెహరా. కేవలం ప్రసాద్‌ మాత్రమే కాదు. ఇండస్ట్రీలో చాలా మంది ఇలా అమ్మాయిలని వేధిస్తున్నారని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఇతని అరెస్ట్‌తో అయినా వాళ్లందరికీ బుద్ధి రావాలని పోస్ట్‌లు చేస్తున్నారు.