దేవరను భయపెడుతున్న సెంటిమెంట్, ఎన్టీఆర్ కెరీర్ కు అదే మైనస్

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ను చూడాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 09:15 PM IST

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ను చూడాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఇక కేజిఎఫ్ రేంజ్ లో ఉంటుందని ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించే సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు నిర్మాతలు అనే మాట వాస్తవం. అయితే ఇక్కడ ఫ్యాన్స్ ని ఒక విషయం భయపెడుతోంది. అదే సెంటిమెంట్… ఏంటి ఆ సెంటిమెంట్ అంటే… గతంలో ఎన్టీఆర్ చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడమే. సాధారణ డిజాస్టర్ లు కాదు అవి. అందుకే ఫ్యాన్స్ లో కంగారు మొదలయింది. ఆ సినిమాలు ఏంటీ అనేది చూస్తే…

మగధీర సినిమా చూసి శక్తి సినిమా తీస్తే అది దారుణంగా ఫ్లాప్ అయింది. నిర్మాత అశ్వినీదత్ చాన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక పోకిరి సినిమా చూసి అలాగే కంత్రీ సినిమా చేస్తే అది కూడా ఫ్లాప్ అయింది. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు. ఇక దూకుడు సినిమా చూసి అదే డైరెక్టర్ తో బాద్షా సినిమా తీస్తే బ్రహ్మానందం కామెడి మినహా ఏం లేదు. ఇక కిక్ చూసి ఊసరవెల్లి అలాగే భిన్నంగా తీసే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ నటనకు మార్కులు పడినా సినిమా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు కేజిఎఫ్ చూసి దేవర తీసాడు అనే టాక్ వస్తోంది. దీనితో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆందోళన మొదలయింది.