Shaakuntalam: ఆ శకుంతల ఎక్కడ.. ఈ శాకుంతలం ఎక్కడ? కాళిదాసు శకుంతలకి, సమంతకి ఎక్కడైనా పోలిక ఉందా?

భారతదేశానికి సంబంధించిన తొలి పౌరాణిక కథ అభిజ్ఞాన శాకుంతలం. భారతదేశ ఉనికికి ఓ చారిత్రక కథనం ఈ కథ. అలాంటి కథను సినిమాగా తీస్తున్నప్పుడు, అందులోని పాత్రలను ప్రేక్షకుల కళ్ల ముందుకు తెస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ సినిమాలో అవేమీ కనిపించలేదు.

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 01:35 PM IST

Shaakuntalam: అయ్యవారిని గీయబోతే కోతి అయిందట! గుణశేఖర్‌ డైరెక్షన్‌లో వచ్చిన శాకుంతలం సినిమా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా శాకుంతలం సినిమా తీశారు. ఆ కథలో కాళిదాసు శకుంతలను శృంగార కథానాయికగా అభివర్ణించాడు. కానీ గుణశేఖర్‌ సమంతని చూపించిన తీరు వేరు. భారతదేశానికి సంబంధించిన తొలి పౌరాణిక కథ అభిజ్ఞాన శాకుంతలం. భారతదేశ ఉనికికి ఓ చారిత్రక కథనం ఈ కథ.

అలాంటి కథను సినిమాగా తీస్తున్నప్పుడు, అందులోని పాత్రలను ప్రేక్షకుల కళ్ల ముందుకు తెస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ సినిమాలో అవేమీ కనిపించలేదు. అన్ని సినిమాల్లో హీరోయన్‌ను చూపించినట్టుగానే ఈ సినిమాలో కూడా సమంతని ప్రజెంట్‌ చేశారు. అసలు శకుంతల ఎవరు? అభిజ్ఞాన శాకుంతలంలో ఆమె పాత్ర ఏంటి? భారతదేశాన్ని పరిపాలించిన భరతుడికి ఆమె తల్లి ఎలా అయింది? భర్తను తిరిగి పొందేందుకు ఆమె ఎన్ని సమస్యలు ఎదుర్కొంది? ఇవేమీ దర్శకుడు పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించలేదు. అసలు అన్నింటికంటే ముందు శకుంతల పాత్రకు సమంతను తీసుకోవడమే పెద్ద తప్పు. శకుంతల ఆకారానికి, ఆహార్యానికి సమంతకు ఎక్కడా సరిపోలదు. అసలు శకుంతల క్యారెక్టర్‌ సమంతకు సెట్‌ కాలేదు.

సినిమా చూస్తున్నంతసేపు అక్కడ సమంతే కనిపించింది తప్ప శకుంతల ఎక్కడా కనిపించలేదు. దానికి తోడు ఆమే సొంత డబ్బింగ్‌ చెప్పుకోవడం ఈ సినిమాకు మరో మైనస్‌ పాయింట్‌గా మారింది. తెలుగులో క్లియర్‌గా మట్లాడలేనప్పడు వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించాలి. కానీ ఈ సినిమాలో సమంతే తన క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెప్పుకుంది. ఎమోషనల్‌ డైలాగ్స్‌ కూడా సమంత డబ్బింగ్‌తో చాలా నార్మల్‌ అనిపించాయి. నిజానికి అభిజ్ఞాన శాకుంతలం కథే పూర్తిగా ఎమోషన్స్‌తో కూడుకుని ఉంటుది. విశ్వామిత్రునికి మేనకకు శకుంతల పుట్టినప్పటి నుంచీ, దుష్యంతుడు ఆమెను భార్యగా స్వీకరించేవరకూ ఎన్నో ఎమోషన్స్‌ సినిమాలో ముడిపడి ఉంటాయి. కానీ వాటిని పండించడంలో సమంత ఫెయిల్‌ అయ్యింది.

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సమంత అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది గ్లామర్‌. ఆమెకు గ్లామర్‌ క్వీన్‌గా పేరుంది. కానీ శకుంతల పేరు చెప్పగానే ప్రతీ ఒక్కరికీ గుర్తు వచ్చేది నిండు తెలుగుదనం. ఇలాంటి గ్లామర్‌ క్వీన్‌తో శంకుతల పాత్రని చూపించాలి అనుకోవడం గుణశేఖర్‌ చేసిన పొరపాటు. సరే.. సమంతతో ట్రై చేద్దాం అనుకున్నారు ఓకే. కానీ ఆమెను సినిమాలో చూపించిన విధానం అయినా బాగుందా అంటే అదీ లేదు. శంకుతల క్యారెక్టర్‌తో కూడా అందాల ఆరబోతకు మొదటి ప్రధాన్యత ఇస్తే ఎలా? కథ చదువుతున్నప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్‌ సినిమా చూస్తున్నప్పుడు రాలేదు. దీనికి తోడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు కార్టూన్‌ ఫ్లేవర్‌ను యాడ్‌ చేశాయి. ఓవరాల్‌గా ఏదో చేయాలని.. ట్రైచేసి.. ఇంకేదో చేశాడు గుణశేఖర్‌.