Salman khan: 58 ఏళ్ల వయసులో బయటపడుతున్న స్టార్ హీరోల ముసలితనం..?

సల్మాన్.. ఫస్ట్ టైం ఏజ్ బార్‌గా కనిపించాడు. ముఖ్యంగా ముసలి తనం వచ్చినట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది. జిమ్ చేయటం మానేశాడో, ఇంకే విషయంలో రిలాక్స్ అయ్యాడో కాని, ఉడకబెట్టి ఆలూలా, ఉబ్బిపోయిన బెలూన్‌లా కనిపించాడు.

  • Written By:
  • Updated On - September 21, 2023 / 07:07 PM IST

Salman khan: సల్మాన్ ఖాన్ మొన్నే వినాయక చవితి రోజు తన చెల్లి ఇంట్లో సెలబ్రేషన్స్ నుంచి బయటికొస్తుంటే మీడియా క్లిక్ చేసింది. బానెడు పొట్ట, తలవెనక బట్ట కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో ఇప్పుడు సల్మాన్‌ని చూసి ఉడకబెట్టిన ఆలులా ఉబ్బిపోయిన ఖాన్ అంటున్నారు. ఖాన్ త్రయంలో ఎప్పుడూ కండలతో ఏజ్‌ని కవర్ చేసే సల్మాన్.. ఫస్ట్ టైం ఏజ్ బార్‌గా కనిపించాడు. ముఖ్యంగా ముసలి తనం వచ్చినట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది. జిమ్ చేయటం మానేశాడో, ఇంకే విషయంలో రిలాక్స్ అయ్యాడో కాని, ఉడకబెట్టి ఆలూలా, ఉబ్బిపోయిన బెలూన్‌లా కనిపించాడు.

కొందరు నెటిజన్స్ అయితే, పెరిగిన పొట్ట తోస్తుంటే, షర్ట్ బటన్ ఊడేలా ఉందంటూ కామెంట్స్ పెట్టారు. నిజంగానే బాలీవుడ్‌లో ముగ్గురు ఖాన్‌ల ఏజ్ ఎప్పుడూ సస్పెన్సే.. అంతా 1965 లోనే పుట్టారు. నెలల వ్యత్యాసం ఉండొచ్చు కాని, షారుఖ్, సల్మాన్, ఆమీర్.. ముగ్గురి బర్త్ ఇయర్ ఒకటే. సల్మాన్ ఖాన్ 58 నిండి 59లో పడుతుంటే, ఆమిర్ కూడా 60కి దగ్గరవుతున్నాడు. ఆ విషయంలో లాల్‌సింగ్ చడ్డాలో ఆమిర్ లుక్‌లోనే తేలిపోయింది. మరి షారుఖ్ ఇంకా ఫిట్‌గా బాగున్నాడే అంటే, ఆ మాట జవాన్‌లో కొన్ని సీన్లు, పాటల్లో తన స్టెప్స్ చూసి చెప్పటం కష్టమే. నిజానికి జవానే కాదు.. పటాన్ కూడా ఐదేళ్ల క్రితం పట్టాలెక్కిన మూవీ. ఈ రెండూ కూడా 70శాతం పూర్తయ్యాక ఆగిపోయిన మూవీలు. తర్వాత సల్మాన్ కొడుకు కేసు, ఆదెబ్బతో ఏడాదిన్నర ఇంటికే పరిమితమైన షారుక్.. ఇలా గడిచిపోయింది.

సో.. పటాన్, జవాన్‌లో 70 శాతం సీన్లు, 55 ఏళ్ల వయసులో షారుఖ్ నటించినవే.. మిగతావి 59 ఏళ్ల వయసులో షారుఖ్ నటించాడు. ఈ మూడు, నాలుగేళ్లలో షారుఖ్ ముఖంలో కళ తగ్గింది. ముడతల లెక్క పెరిగింది. అదే జవాన్ సాంగ్స్‌లో కూడా కనిపిస్తోంది. ఇప్పడు సల్మాన్ కూడా ఉబ్బిపోయినట్టు కనిపించటంలో.. ఖాన్‌ల ముసలితనం మీద సోషల్ మీడియాలో కామెంట్ల జోరు పెరిగింది.