Shah Rukh Khan: షారుఖ్ సక్సెస్ సీక్రెట్.. అమ్మవారిని దర్శించుకుంటే హిట్ ఖాయమా!

ఇప్పటికే 2023లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఏడాదిలోనే తన మూడో సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా మరోసారి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు షారుక్.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 03:40 PM IST

Shah Rukh Khan: సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ మయం. అందుకున్న ప్రతి సక్సెస్ వెనుకా ఓ సెంటిమెంట్ ఉందని భావిస్తారు. 2023లో మాంచి జోరుమీదున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఇప్పుడిదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. పఠాన్, జవాన్ హిట్స్‌కి అదే కారణం అని భావించిన బాద్ షా.. డంకీ విడుదలకు ముందు కూడా అదే ఫాలో అవుతున్నాడు. ప్రతి నటుడు తమ సినిమాల విడుదలకు ముందు ఓ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అలా చేస్తే సినిమా హిట్ పక్కా అని ఫిక్సవుతారు. షారుక్ ఖాన్ కూడా ఇప్పుడిదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే 2023లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

Sanjay Dutt : సంజయ్‌ దత్‌ విలన్‌గానే స్థిరపడిపోతాడా..

ఇప్పుడు ఈ ఏడాదిలోనే తన మూడో సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా మరోసారి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు షారుక్. ఈ ఆలయానికి వెళ్లడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. పఠాన్, జవాన్ సినిమాల విడుదలకు ముందు కూడా ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. త్వరలో డంకీ విడుదల కానుండడంతో మరోసారి ఈ ఆలయానికి వెళ్లాడు. దీంతో తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఈ ఆలయానికి వెళ్లడం సెంటిమెంట్‌గా మారిందంటున్నారంతా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, తాప్సీ లీడ్ రోల్స్ చేసిన ‘డంకీ’.. డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ స్టోరీపై ఉన్న నమ్మకంతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’లాంటి యాక్షన్ సినిమాతో తలపడేందుకు కూడా తగ్గడం లేదు షారుక్. ఇప్పటికే విడుదలైన ‘డంకీ’ సినిమా ట్రైలర్‌పై మంచి టాక్ వచ్చింది. షారుఖ్ మునుపటి సినిమాలా ఇదొక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా కాదు.

ఇందులో రాజ్‌కుమార్ హిరానీ స్టైల్‌లో ఒక మెసేజ్ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఫారిన్ వెళ్లాలనుకుని కలలు కనే నలుగురు స్నేహితుల కథ. ఇది పలు నిజ జీవిత సంఘటనలపై ఆధారపడి తెరకెక్కిన చిత్రమని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. మూవీ విడుదల దగ్గరపడడంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ముందుగా వైష్ణోదేవిని దర్శించుకున్నాడు కింగ్ ఖాన్. మరి గత సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ మరోసారి అమ్మవారిని దర్శించుకున్నాడు. డంకీతో ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్సైపోయాడు షారుక్. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకూ నిజమవుతుందో వెయిట్ అండ్ సీ.