Salaar: సలార్ రాబోయే డిసెంబర్ 22కి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య పరోక్షంగా ఇన్‌స్టా ద్వారా ఇచ్చిన హింట్‌తో ఈ విషయం తెలిసిపోయింది. ఆమె పోస్టుతోపాటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మళ్లీ మొదలు పెడదామా అంటూ పెట్టిన ట్వీట్, అలానే డిసెంబర్ రిలీజ్ అంటూ రెడీ అవుతున్నమోషన్ పోస్టర్‌తో ఇది ఫైనల్ అని తేలింది. సమ్మర్‌కి తప్ప మరో ఆప్షన్ లేదని బాదపడ్డ సలార్ టీంకి, నార్త్ ఇండియా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ తోడుగా నిలిచారట.
క్రిస్మస్ సీజన్‌లో షారుఖ్ ఖాన్ మూవీ డంకీ రాబోతోంది. ఆదెప్పుడో ఫిక్స్ అయ్యింది. ఆ మూవీ డిస్ట్రిబ్యూట్ చేసే బ్యాచ్ సలార్ రైట్స్‌ని వదులుకోవటంతో, కొత్త డిస్ట్రిబ్యూటర్లు సీన్‌లోకొచ్చారు. దీంతో సలార్‌ని క్రిస్మస్‌కి రిలీజ్ చేయటంలో వాళ్లకేం అభ్యంతరం లేకపోవటం వల్ల, విడుదల తేది సమ్మర్‌కి వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. పాన్ ఇండియా మొదటి హీరోనే కాదు, సూపర్ హీరోగా కూడా ప్రభాస్‌కి ఉన్న ఇమేజ్ వేరు. అలాని నార్త్ ఇండియాలో షారుఖ్ మూవీ డంకీతో పోటీ పడితే రిస్క్ లేదనలేం. అసలే పటాన్, జవాన్‌తో చెరో వెయ్యి కోట్ల వసూళ్ల రికార్డు సొంతం చేసుకున్నాడు షారుఖ్. ఇక త్రీ ఇడియట్స్ ఫేం రాజ్ కుమార్ హీరానీ మేకింగ్‌లో డంకీ అంటూ హ్యాట్రిక్‌కి సిద్దమయ్యాడు. సో డంకీ.. సౌత్ లో సమస్య కాకున్నా, నార్త్ మార్కెట్‌లో సలార్ కి ఖచ్చితంగా ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చు.
కనీసం రూ.500 కోట్ల మార్కెట్ ఉంది కాబట్టే హిందీ బెల్ట్‌లో సలార్‌కి ఏదీ అంత ఈజీ కాదంటున్నారు. అందుకే డిసెంబర్ 22 రిలీజ్ డేట్ అంటేనే రిస్క్ అంటున్నారు. అయితే ప్రభాస్ కూడా చిన్న కటౌట్ ఏం కాదు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా మూడు ఫ్లాపులు పడ్డాయి. సాహో కొంత బెటర్. ఇన్ని ఫెల్యూర్స్ వచ్చినా తన క్రేజ్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. సో మ్యాటర్ ఉన్న మూవీ పడితే ప్రభాస్‌ని ఆపలేం. సలార్ అలాంటి మూవీనే కాబట్టే, డంకీతో పోటీకి ఫిల్మ్ టీం తెగిస్తోందని తెలుస్తోంది.