Prabhas, Shah Rukh Khan : ప్రభాస్‌తో పోటీ పడలేనంటున్న షారూక్‌

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త సినిమా ‘సలార్‌’ డిసెంబర్‌ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి పోటీగా షారూక్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన డిఫరెంట్‌ మూవీ ‘డంకీ’ డిసెంబర్‌ 21న రిలీజ్‌ కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందని అందరూ భావించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త సినిమా ‘సలార్‌’ డిసెంబర్‌ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి పోటీగా షారూక్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన డిఫరెంట్‌ మూవీ ‘డంకీ’ డిసెంబర్‌ 21న రిలీజ్‌ కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తెలుగు నుంచి ‘డంకీ’ తప్పుకుందని తెలుస్తోంది. ‘సలార్‌’లాంటి సినిమా తెలుగులో రిలీజ్‌ అవుతోందంటే తప్పకుండా థియేటర్ల సమస్య ఎదురవుతుందని ‘డంకీ’ మేకర్స్‌ భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవడానికి ఈ సినిమా కంటెంట్‌ తెలుగు నేటివిటికీ సంబంధించింది కాకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కథాంశంతో ‘డంకీ’ రూపొందింది.

‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో షారూక్‌కి కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌ బాగా పెరిగింది. ఈ సమయంలో ‘డంకీ’ రిలీజ్‌ అయి సక్సెస్‌ కాకపోతే అతని మార్కెట్‌ దెబ్బతిన్నట్టు అవుతుంది తప్ప లాభం ఏమీ ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. షారూఖ్‌ ఖాన్‌ ప్రమోషన్స్‌లో కూడా స్పీడ్‌ లేకపోవడం, ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చెయ్యకపోవడం చూస్తుంటే వినిపిస్తున్న వార్తలో నిజం ఉందనేది అర్థమవుతోంది. అయితే తెలుగులో ‘డంకీ’ రిలీజ్‌ లేదనే వార్తను అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.

‘డంకీ’ కథ విషయానికి వస్తే.. ఐదుగురు స్నేహితుల కథ ఇది. మిత్రులంతా కలిసి లండన్‌ వెళ్ళాలనుకుంటారు. అక్కడికి వెళ్లాలంటే ఇంగ్లీష్‌ వచ్చి ఉండాలని తెలుసుకుంటారు. వారికి వీసా కూడా రిజెక్ట్‌ అవుతుంది. గతంలో బ్రిటిష్‌ వారు ఇండియా అక్రమంగా ఎలా వచ్చారో వీరు కూడా లండన్‌ అలాగే వెళతారు. అక్కడికి వెళ్ళిన ఈ ఐదుగురు స్నేహితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో ఘన విజయాలు అందుకున్న షారూక్‌ ‘డంకీ’తో హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ అనుకున్న తేదీకి లేదు అనే వార్త స్ప్రెడ్‌ అవుతుండడంతో తెలుగులో రిలీజ్‌ లేదనే అందరూ భావిస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్‌ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.