Shaitan: బూతులు ఎన్ని ఎక్కువుంటే అంత గొప్ప.. ఎవడు చూడమన్నాడు..?

ఎంత వల్గర్‌గా బూతులు మాట్లాడుతూ.. బూతు సీన్లు పెడితే అంత క్రియేటివిటి. ఓటీటీ వచ్చినప్పటి నుంచి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు హాలీవుడ్‌ని చూసి ఇక్కడి దర్శకులు బూతులతో రెచ్చిపోతున్నారు.

  • Written By:
  • Updated On - June 10, 2023 / 06:31 PM IST

Shaitan: ఒక సినిమాలో హీరోయిన్‌ను నగ్నంగా బ్యాక్ నుంచి చూపించి, నాలుగు బూతులు, ఐదారు సెక్స్ సీన్స్ పెడితే చాలు. ఆ మూవీ, లేదంటే వెబ్ సీరీస్ హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కినట్టు. ఎంత వల్గర్‌గా బూతులు మాట్లాడుతూ.. బూతు సీన్లు పెడితే అంత క్రియేటివిటి. ఓటీటీ వచ్చినప్పటి నుంచి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు హాలీవుడ్‌ని చూసి ఇక్కడి దర్శకులు బూతులతో రెచ్చిపోతున్నారు. రానా నాయుడైతే ఏంటో బోండాలు చూస్తున్నావా అని ఒక సీన్లో బూతు డైలాగ్ వినిపిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే గల్లీలో చిల్లరగా తాగివాగే వాళ్లను మించేలా బూతులు పెట్టారు. ఫస్ట్ ఈ వెబ్ సీరీస్ ఫోకస్ కాకున్నా, బూతులెందుకు పెట్టారో అనే కామెంట్లతో జనాల్లో క్యూరియాసిటీ పెరిగి అలా కూడా చూశారు కొందరు. సో జనం చూస్తున్నారని ఇలా తీస్తే, బ్లూ ఫిల్మ్ చూసే బ్యాచ్ కూడా ఉంటుంది. అలాగని వల్గర్ ప్రయోగాలు చేస్తారా..?
ఇలాంటి కామెంట్లు ఎన్ని వచ్చినా సైతాన్‍లో నా బూతే నా భవిష్యత్ అనేలా బూతులతో పంచ్ డైలాగ్స్ విసిరాడు దర్శకుడు. ఏందిది అంటే చూసేవాళ్లు చూస్తారు.. అది వాళ్ల పర్సనల్ చాయిస్ అనేశాడు. ఇంతకు తెగించారు దర్శకులు. అదేంటో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీ అంటే కథలోనో, కథనంలోనో, మేకింగ్‌లోనో ఓరేంజ్ క్వాలిటీ, క్రియేటివిటీ చూపించాల్సింది పోయి, బూతులు పెట్టడం, బూతు సీన్లు తీయటమే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి కొలమానంగా మారింది. ఇది షార్ట్ కట్ కాబట్టే, గొప్పగా ఆలోచించలేక, కల్తీ ఆలోచనలతో వెబ్ సీరీస్‌లు, ఓటీటీ ప్రయోగాలు చేస్తున్నారనే వాదన పెరుగుతోంది.