Ram Charan: కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ నిజంగానే మెగా పవర్ స్టార్ కొంపముంచేలా ఉన్నాడు. ఆల్ మోస్ట్ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ మూవీలో లాస్ట్ షెడ్యూల్‌లో రోజంతా ఓ సీన్ షూట్ చేసి, ఆ ఫుటేజ్ అంతా వేస్ట్ అని మళ్లీ అదే సీన్‌ని కొత్త షెడ్యూల్‌లో తీసేందుకు సిద్దమయ్యాడు. వింత ఏంటంటే శంకర్ మరోసారి చెర్రీతో సినిమా ప్లాన్ చేశాడని విచిత్రమైన గుసగుసలొచ్చాయి.
అలాంటిదేం లేదు, కేవలం గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ షూటింగే షురూ కాబోతోందని, దాన్ని సినీ జనం తప్పుగా అర్దం చేసుకున్నారని తెలుస్తోంది. చరణ్‌తో శంకర్ సినిమా తీస్తా అన్నా చెర్రీ చేసేందుకు సిద్దంగా లేడట. గేమ్ ఛేంజర్ బడ్జెట్ ఎప్పుడో బకెట్ తన్నేసింది. పెండింగ్ షూటింగ్ విషయంలో కూడా శంకర్ ఏకంగా దిల్ రాజునే సతాయిస్తున్నాడట. ఇదంతా నచ్చకే హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలనుని సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా మార్చి కొన్ని సీన్లు, ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేయిస్తున్నాడు దిల్ రాజు. అసలే రోబో తర్వాత నన్బన్, ఐ, రోబో 2 అంటూ మెగా ఫ్లాపులు అందుకున్నాడు శంకర్. అలానే భారతీయుడు-2 ని సీరియల్‌లా సాగతీస్తూ వివాదాలతో కాపురం చేస్తూ మొత్తానికి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
అలాంటి ఈ దర్శకుడితో సినిమా అంటే చరణ్ రిస్క్ చేసినట్టే అనుకుంటున్న టైంలో, శంకర్ వ్యవహారం మెగా ఫ్యాన్స్‌ని కంగారు పెట్టేలా ఉంది. గేమ్ ఛేంజర్‌కి శంకర్ ప్లస్సో, మైనస్సో అర్ధం చేసుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి.