BIGG BOSS : కొత్త కెప్టెన్ గా శివాజీ.. రతిక ఫెయిల్.. అమర్ పాస్..

బిగ్ బాస్ (BIGG BOSS) వీకెండ్ వచ్చేసింది. నాగార్జున (Nagarjuna) కలర్ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ఎప్పటిలాగే.. రాగానే.. ఇంట్లో జరిగిన రచ్చ చూపించారు. ఇంటిసభ్యులు ఒకరి తప్పులను మరొకరి ముందు చెప్పుకుని.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చెప్పుకున్నారు.

బిగ్ బాస్ (BIGG BOSS) వీకెండ్ వచ్చేసింది. నాగార్జున (Nagarjuna) కలర్ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ఎప్పటిలాగే.. రాగానే.. ఇంట్లో జరిగిన రచ్చ చూపించారు. ఇంటిసభ్యులు ఒకరి తప్పులను మరొకరి ముందు చెప్పుకుని.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చెప్పుకున్నారు. అమర్, శోభా శెట్టి.. ప్రియాంక ల మధ్య కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన టాపిక్ పై వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత యావర్ , రతిక తమకు జరిగిన అన్యాయంపై చర్చించుకున్నారు. అనంతరం.. ఇంటి సభ్యులను పలకరించాడు నాగార్జున. హౌస్ మెంట్స్ అంత నాగ్ ముందు హుషార్ గా కనిపించి సందడి చేశారు.

శోభా శెట్టి కెప్టెన్ గురించి హౌస్ మెట్స్ ఫీల్డ్ బ్యాక్ తెలుసుకున్నాడు నాగార్జున. మొదట అర్జున్ శోభా కెప్టెన్సీ గురించి.. అడగ్గా.. బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పగా.. అందరు నవ్వేశారు. అనంతరం శివాజీ తో మాట్లాడాడు నాగార్జున. నీ కొడుకు అచ్చం నీలాగే ఉన్నాడు అనగానే.. అవును బాబు గారు అనేశాడు. ఇలా ఇంటిసభ్యులతో మాట్లాడిన నాగార్జున.. కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన శివాజీ అర్జున్ ల్లో ఎవరు కెప్టెన్ గా ఉండాలని భావిస్తున్నారో చెప్పమన్నాడు. ఈ ప్రాసెస్ లో భాగంగా.. ఇంటి సభ్యులు కన్సెషన్ రూం కి పిలిచి… అభిప్రాయాలను కనుకున్నాడు. యూనానిమన్ గా శివాజీకి ఓటేశారు. దీంతో శోభాశెట్టి శివాజీకి కెప్పెన్సీ కిరిటాన్ని పెట్టగా.. అర్జున్ కెప్టెన్సీ బ్యాడ్జిని పెట్టాడు. అనంతరం సరదాగా మాట్లాడుకున్నారు. అంతేకాక శోభా చేత కాపీ తెప్పించుకుని తాగాడు నాగార్జున.

ఇంటి సభ్యులకు చిన్న గేమ్ ఆడించారు నాగార్జున. పది వారాల్లో ఇంటి సభ్యులు ఆటతీరుపై.. ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ అయ్యారో చెప్పాలని సూచించారు. దీంతో చాలా మంది రతికకు ఫెయిల్ మార్కులు ఇవ్వగా.. అమర్ కు పాస్ మార్కులు ఇచ్చారు. ఈ గేమ్ చాలా సరదాగా సాగింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో నామినేషన్స్ లో ఏమైనా అన్యాయం జరిగిందా అంటూ అడగ్గా.. బోలే తనకు జగిరిన అన్యాయంపై వివరణ ఇచ్చుకున్నాడు. రతిక, అశ్విన్, యావర్ సైతం తమ వాయిస్ ను వినిపించారు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. ఈ వారం ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.