బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసింది.. ట్విస్టుల మీద ట్విస్టులతో హీట్ పెంచేస్తోంది.. ఇక ఈవారం ఆదివారం ఎపిసోడ్ సైతం పూర్తైంది. ఈసారి మాత్రం ఫస్ట్ టైమ్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది.. ఆదివారం నాగార్జున ఫన్నీగా షో స్టార్ట్ చేశారు. పలు రకాల గేమ్ ఆడించారు.. ఒక పక్క ఎలిమినేషన్ ప్రక్రియ నడుస్తూ వచ్చింది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు.
శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. అంతా ఊహించినట్లే ఆదివారం రతిక ఎలిమినేట్ అయిపోయింది.. ఎవిక్షన్ పాస్ ఉపయోగించమని రైతు బిడ్డను, శివాజీని సైతం బతిమాలినా ప్రయోజనం లేకపోయింది.. దీంతో రతికకు మరోసారి నిరావ తప్పలేదు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో సరదాగా గేమ్స్ ఆడించారు. SPA, SPY టీమ్ లను విడిగా కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న వస్తువుల గురించి ఆసక్తికర క్వశ్చన్స్ అడిగారు. అయితే ఇందులో మాత్రం రతిక అదరగొట్టేసింది. అడిగిన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో నాగ్ సైతం ఆశ్చర్యపోయారు. ఆడడం మానేసి ఇవన్నీ లెక్కపెడుతూ కూర్చున్నావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు..
ఇక స్టేజ్ పైకి వచ్చిన రతిక ఒక్కొక్కరి గురించి చెప్పేసింది. ముందుగా శివాజీ అన్నా కంట్రోల్ గా మాట్లాడు.. ఇలాగే అన్నా అని పిలుస్తుంటాను అని చెప్పింది. ఇక యావర్ టికెట్ టూ ఫినాలే విన్ అవ్వు అని.. అర్జున్ స్ట్రాంగ్ కానీ కొన్ని మార్చుకుని బాగా ఆడాలని చెప్పింది. ఆ తర్వాత ప్రియాంకను సరదాగా ఆటపట్టించింది రతిక. వెళ్లగానే నీ లవర్ శివ్ దగ్గరికి వెళ్లి రోజ్ తీసుకుంటా అంటూ రతిక అనడంతో తీసుకో నీకు ఉంటది అంటూ నవ్వింది ప్రియాంక. శివాజీ అన్నతో ఉన్న డిస్ట్రబెన్స్ క్లియర్ చేసుకో అంటే..నామినేషన్స్ లో మాట్లాడతా అని చెప్పేసింది. ఇక తర్వాత ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ నువ్వే వాడుకో అంటే.. సారీ అక్కా అనేశాడు. ఇక ఆ తర్వాత రతిక కోసం ఓ కవిత చెప్పాడు. మట్టి వాసన ఎంత స్వచ్ఛంగా ఉంటుందో..నేను నీ గురించి మాట్లాడే ప్రతి మాట అలాగే మనసులో నుంచి నిజాయితీగా వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.