Bigg Boss : జైలుకి వెళ్లిన వెళ్లిన శివాజీ.. బంపర్ ఛాన్స్ మిస్

బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్ తో హీటెక్కిపోయింది. దీంతో కాస్త కూల్ చేసేందుకు ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈసారి ఒక స్కిట్ రూపంలో టాస్క్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న పది మంది వారి పాత్రల్లో జీవించేస్తున్నారు. గత ఎపిసోడ్ లో బిగ్ బాస్ తన భార్య అందరికీ లంచ్ పార్టీ ఏర్పాటు చేసిందని చెప్పి .. కంటెస్టెంట్స్ కి అదిరిపోయే బిర్యానీ పెట్టాడు.

బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్ తో హీటెక్కిపోయింది. దీంతో కాస్త కూల్ చేసేందుకు ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈసారి ఒక స్కిట్ రూపంలో టాస్క్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న పది మంది వారి పాత్రల్లో జీవించేస్తున్నారు. గత ఎపిసోడ్ లో బిగ్ బాస్ తన భార్య అందరికీ లంచ్ పార్టీ ఏర్పాటు చేసిందని చెప్పి .. కంటెస్టెంట్స్ కి అదిరిపోయే బిర్యానీ పెట్టాడు. మిసెస్ బిగ్ బాస్ ని చంపేసి .. ఆమె నెక్లెస్ ఎవరో ఎత్తుకెళ్లారు ఆ హంతకుడు ఎవరో కనిపెట్టాలని బిగ్ బాస్ చెప్పారు. ఈ క్రమంలోనే అమర్ దీప్, అర్జున్ పోలీసులుగా అవతారమెత్తారు. అమర్ దీప్ విక్రమార్కుడు సినిమాలో రవితేజ లాగా పెర్ఫామెన్స్ చించేసాడు. ఫన్నీ పోలీస్ గా ఎంటర్టైన్ చేశాడు. ఇక శోభా శెట్టి, అశ్విని లు లేడీ న్యూస్ రిపోర్ట్స్ గా .. బ్రేకింగ్ న్యూస్ కోసం పోటీ పడుతున్నారు.

Prabhas Vs Shah Rukh Khan: బాక్సాఫీస్ యుద్ధం.. సౌత్, నార్త్ మధ్యయుద్ధం ఫిక్స్

బిగ్ బాస్ హౌస్ కాస్త పోలీసుల అడ్డాగా మారిపోవడంతో అర్జున్, అమర్ దీప్ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంటిసభ్యులను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు.
రతిక బిగ్ బాస్ భార్య కార్ డ్రైవర్. గౌతమ్ ఏమో వంటోడు. యావర్, ప్రియాంక లు పనోళ్ళుగా పాత్రలు పోషిస్తున్నారు. ఇక శివాజీ బిగ్ బాస్ వైఫ్ కి గుమస్తాగా కనిపించాడు. ఇలా ఎవరి పాత్రల్లో వాళ్ళు ఇమిడిపోయారు. అయితే ఇందులో శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరికి అనుమానం రాకుండా పల్లవి ప్రశాంత్, అశ్విని చంపాలని చెప్పాడు.

శివాజీ ఆ ఇద్దరిని చంపాడు కానీ దొరికిపోయాడు. ఇంటి సభ్యులు ఆ హత్యలు చేసింది శివాజీ అని పసిగట్టారు. దీంతో శివాజీ టాస్క్ లో ఫెయిల్ అయినట్లు ప్రకటించి.. అతడిని జైల్లో వేశారు. ఈ వారం శివాజీ కాస్త టాస్కుల్లో స్లో అయినట్లు కనిపిస్తున్నాడు. ఇక సీక్రెట్ టాస్క్ లో కూడా ఫెయిల్ అయి జైలుకు వెళ్ళాడు. దీంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాడు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో జరిగిన హత్యను ఛేదించి.. అసలు నిందితుడి పట్టుకున్నారు.