జైలర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్కడ ఆగుతుందో ట్రేడ్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. రజనీకాంత్.. దర్శకుడు నెల్సన్‌తో పాటు మరో ఒకర్ని ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. మోహన్‌లాల్.. శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించినా.. క్లైమాక్స్‌లో శివరాజ్‌కుమార్‌కు ఆడియన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. జైలర్‌తో కన్నడ సూపర్‌స్టార్ మంచి పవర్‌ఫుల్ రోల్ పడింది. కర్ణాటకలో ఊహించనివిధంగా 50 కోట్లకు పైగా రావడానికి శివరాజ్‌కుమార్ రోల్ హెల్ఫ్ అయింది. కన్నడ సినిమాలకే పరిమితమయ్యే ఈ సూపర్‌స్టార్ అప్పుడప్పుడూ ఇలా గెస్ట్ అపీరియన్స్ ఇస్తూ వుంటారు.
బాలయ్య కోసం.. గౌతమీపుత్ర శాతకర్ణిలోని ఓ పాటలో బుర్ర కథలో కనిపించారు. మంచి అనుబంధం వున్న హీరోలు తప్ప శివరాజ్‌కుమార్ మరో భాషలో నటించరు. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ గెస్ట్ అపీరియన్స ఇస్తున్నారు. తమిళంలో అజిత్, ధనుష్ యాక్టింగ్ అంటే ఈ సూపర్‌స్టార్‌కు ఇష్టమట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధనుష్ ప్రతి సినిమా చూస్తానన్నాడు. శివరాజ్‌కుమార్‌కు కన్నడలోనే కాదు.. తమిళం.. మలయాళం.. తెలుగులో కూడా అభిమానులున్నారు.
నటుడిగా కంటే వ్యక్తిగతంగా ఆయన్ని ఆభిమానించేవారే ఎక్కువ. సేవా కార్యక్రమాలు.. సింప్లిసిటీ ఎంతో మందిని ఆయనకు దగ్గర చేసింది. 60 ప్లస్‌లో జైలర్‌తో పూర్వవైభవం వచ్చిందని సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఖుషీగా వున్నారు. గౌతమీపుత్రశాతకర్ణి.. జైలర్ హిట్ కావడంతో.. శివన్న గెస్ట్ అపీరియన్స్ ఇస్తే చాలు.. సినిమా హిట్ అంటున్నారు అభిమానులు.