చైతూ – శోభిత పెళ్లి అమ్మేసారు… లైవ్ స్ట్రీం అక్కడే

ఏ మాటకు ఆ మాట సినిమా వాళ్ళు ఏ రూపంలో డబ్బులు వచ్చినా వదులుకోరు. జనాలకు వినోదం పేరుతో దేనికి అయినా సరే రెడీ అన్నట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహారశైలి. ఈ మధ్య కాలంలో పెళ్లి లైవ్ ను అమ్ముకోవడం అనే ట్రెండ్ ఒకటి మొదలుపెట్టారు. నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరి పేరుతో నయనతార తన పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ వాళ్లకు 25 కోట్లకు అమ్ముకుంది.

  • Written By:
  • Publish Date - November 26, 2024 / 06:58 PM IST

ఏ మాటకు ఆ మాట సినిమా వాళ్ళు ఏ రూపంలో డబ్బులు వచ్చినా వదులుకోరు. జనాలకు వినోదం పేరుతో దేనికి అయినా సరే రెడీ అన్నట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహారశైలి. ఈ మధ్య కాలంలో పెళ్లి లైవ్ ను అమ్ముకోవడం అనే ట్రెండ్ ఒకటి మొదలుపెట్టారు. నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరి పేరుతో నయనతార తన పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ వాళ్లకు 25 కోట్లకు అమ్ముకుంది. అది చూసి జనాలు షాక్ అయ్యారు. కాని అమ్మడు మాత్రం ఓ సినిమాలో క్లిప్ కు పది కోట్లు డిమాండ్ చేసాడు అంటూ ధనుష్ పై ఫైర్ అవుతూ ఓ లెటర్ రాసింది.

పెళ్లి వీడియో నువ్వు అమ్ముకున్నప్పుడు ధనుష్ తన సినిమా వీడియో అమ్ముకుంటే తప్పు ఏంటీ పాప అంటూ సోషల్ మీడియాలో జనాలు బూతులు తిడుతున్నారు. ఇక ఈ నెట్ ఫ్లిక్స్ లో పెద్దగా అంత కంటెంట్ ఏం లేదు. లేడీ సూపర్ స్టార్ అని నమ్మి వాళ్ళు కొన్నా… చూడటానికి మాత్రం రాడ్ లా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక నయనతార ట్రెండ్ ను ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ కూడా ఫాలో అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగ చైతన్య, శోభిత వివాహం త్వరలో జరగనుంది.

ఈ వివాహానికి హాజరు అయ్యే అతిధులు ఎవరూ అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. కాని అతిధులకు ఓ ఒటీటీలో లైవ్ స్ట్రీం ద్వారా చూపించాలని అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేసింది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ళ డిసెంబరు 4న ఒక ఇంటివారవుతున్న నేపధ్యంలో… ఈ పెళ్లిని లైవ్ స్ట్రీం చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్న వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

శోభిత తల్లితండ్రుల కోరిక మేరకే ఈ పద్ధతిలో వీరి పెళ్లి చేస్తున్నారు పెద్దలు. డిసెంబరు 4న రాత్రి 8:13 నిమిషాలకు పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారని వార్తలు వస్తున్నాయి. ముందు నుంచి అతిధులు ఎవరు, రాజకీయ నాయకులు వస్తారా… సినిమా వాళ్ళను అందరిని పిలుస్తారా అంటూ యేవో వార్తలు వచ్చాయి. కాని 100 నుంచి 150 మంది మాత్రమె ఈ పెళ్ళికి హాజరు కానున్నారు. సినిమా వాళ్ళు కూడా చాలా తక్కువ మందే హాజరు అవుతున్నారు. ఈ పెళ్లి హక్కులను ఓ ప్రముఖ ఒటీటీ సంస్థకు నెల రోజుల క్రితమే అమ్మేసారు అని టాక్. దీనిపై సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ వస్తున్నాయి. వీళ్ళ సినిమాలే చూడరు పెళ్లి చూస్తారా అంటూ సెటైర్ లు వేస్తున్నారు. అయినా పెళ్లి వీడియో అమ్ముకోవడం ఏంటో…?