Bigg Boss Season 7 : బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు షాక్‌

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విన్నర్‌గా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌. షీల్డ్ అందుకున్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ విజయం తనది కాదని.. గెలిపించిన ప్రతీ ఒక్కరిది అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్, ఒక విటారా బ్రీజా కారుతో పాటు మరో 15 లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ప్రశాంత్‌కు ఇవ్వనున్నారు.

 

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విన్నర్‌గా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌. షీల్డ్ అందుకున్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ విజయం తనది కాదని.. గెలిపించిన ప్రతీ ఒక్కరిది అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్, ఒక విటారా బ్రీజా కారుతో పాటు మరో 15 లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ప్రశాంత్‌కు ఇవ్వనున్నారు. ఇక అటు సీరియల్ యాక్టర్‌ అమరదీప్‌.. రన్నరప్‌గా నిలిచాడు. ఐతే ఫినాలే సమయంలో అన్నపూర్ణ స్టూడియోకు.. ప్రశాంత్‌, అమరదీప్ ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు. ఫినాలే తర్వాత.. ఇద్దరి అభిమానుల మధ్య రగడ మొదలైంది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. పోలీసుల విచారణ మొదలుపెట్టి బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు.. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద ఫైల్ చేశారు. ఇక గుర్తించిన పలువురు అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్‌పై ఈ కేసులు నమోదు చేశారు. ఆరు బస్సులు, ఓ పోలీస్‌ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ఫ్యాన్స్ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజీ, వీడియో లో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించామని ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు. ఐతే బిగ్‌బాస్ గెలిచిన సంతోషం ఒక్కరోజు కూడా ప్రశాంత్‌కు లేకుండా పోయింది. అభిమానుల హడావుడి కారణంగా.. ఇప్పుడు అతని మీద కేసు నమోదయింది. బస్సుల దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సీరియస్ అయ్యారు. దీంతో రచ్చ రోజురోజుకు మరింత ముదిరిలా కనిపిస్తోంది.