Sai Dharam Tej : సాయిధరమ్‌ తేజ్‌కు షాక్‌.. పోలీసుల నుంచి నోటీసులు

సొసైటీలో మీడియా ప్లే చేసే రోల్‌ చాలా కీలకం. ముఖ్యంగా సినిమాలు సమాజం మీద చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. మంచో చెడో తెలియకపోయినా చాలా మంది సినిమాలను, అందులో హీరోలను ఫాలో అవుతుంటారు.

సొసైటీలో మీడియా ప్లే చేసే రోల్‌ చాలా కీలకం. ముఖ్యంగా సినిమాలు సమాజం మీద చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. మంచో చెడో తెలియకపోయినా చాలా మంది సినిమాలను, అందులో హీరోలను ఫాలో అవుతుంటారు. పక్కవాళ్లు ఏమనుకుంటారు అన్న మతి ఏకుండా పిచ్చి ఫ్యాషన్‌ ఫాలో అయ్యేవాళ్లు కొందరైతే.. హీరోఇజాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని తప్పుడు పనులు చేసేవాళ్లు కొందరు. కామన్‌ ఆడియన్స్‌తో ఎలాంటి సమస్య ఉండదు కానీ.. ఇలాంటి బ్యాచ్‌తో ఉన్న సమస్య మొత్తం ఉంటుంది. సుప్రీం హీరో (Supreme Hero) సాయిధరమ్‌ తేజ్‌కు(Sai Dharam Tej), ఆయన కొత్త సినిమా గాంజా శంకర్‌ యూనిట్‌కు ఇదే విషయాన్ని కాస్త క్లాస్‌గా చెప్పారు పోలీసులు. వెంటనే టైటిల్‌ మార్చాలంటూ నోటీసులు జారీ చేశారు.

ఒకవేళ సినిమాలో గాంజాను ప్రోత్సహించే కంటెంట్‌ ఉంటే మాత్రం జైలు శిక్ష తప్పదంటూ నోటీసుల్లో చాలా క్లియర్‌గా మెన్షన్‌ చేశారు. ఎందుకంటే సినిమా హీరోలను వాళ్ల ఫ్యాన్స్‌ ఫాలో అవడం చాలా కామన్‌. సినిమా హీరో క్రైమ్‌ చేసినా దాన్ని హీరోయిక్‌గా చూపిస్తారు కాబట్టి యూత్‌ కూడా అదే దారిలో వెళ్లే ప్రమాదం ఉంది. ఆ మధ్య కేజీఎఫ్‌ (KGF) సినిమారిలీజ్‌ ఐనప్పుడు ఓ వ్యక్తి రాఖీ భాయ్‌లా అవ్వాలంటూ ఏ పాపం తెలియని ఇద్దరు వ్యక్తులను సుత్తితో కొట్టి చంపేశాడు. ఇలా సినిమా ప్రభావం కొందరు వ్యక్తులపై చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే తీసే సినిమాలు చాలా జాగ్రత్తగా బాధ్యతతో తీయాలి. మంచి మెసేజ్‌ ఇవ్వాలి కానీ క్రైమ్‌ను కూడా హీరో యాంగిల్‌లో చూపించొద్దు.

ఇదే విషయాన్ని నోటీసుల్లో మూవీ యూనిట్‌కు అర్థమయ్యేలా చెప్పారు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్‌ వాడకం రోజు రోజుకూ పెరిగిపోతోంది. దానికి తోడు ఇలాంటి టైటిల్స్‌తో సినిమాలు వస్తే వాళ్లకు మంచి ఉత్తేజం ఇచ్చినట్టు అవుతుందే తప్ప ఎలాంటి యూజ్‌ లేదు అంటున్నారు పోలీసులు. కేవలం గంజాయి (Ganjai) శంకర్‌ యూనిట్‌ మాత్రమే కాదు.. మిగతా డైరెక్టర్స్‌ కూడా సినిమాలు తీసేటప్పుడు కాస్త సొసైటీ, హ్యూమన్‌ యాంగిల్‌ కూడా ఆలోచించిం తీయాలి అంటున్నారు.