సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. లాంగ్వేజ్ ఏదైనా కావొచ్చు.. ఆడియన్స్ ఏ స్టేట్ నుంచైనా ఉండొచ్చ.. కానీ సాయి పల్లవి స్క్రీన్ మీద కనిపిస్తే.. విజిల్స్‌తో టాప్ లేచిపోవాల్సిందే. క్యారెక్టర్ ఏదైనా అది తనకోసమే రాశారేమో అన్న రేంజ్లో యాక్టింగ్ చేయడం సాయి పల్లవి బలం. ఆ బలమే ఆమెను లేడీ పవర్ స్టార్‌ను చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్లో.. తెలుగింటి హీరోయిన్స్ కంటే పది రెట్లు సాయి పల్లవిని అభిమానించారు మన ఆడియన్స్. కానీ ఇప్పుడు అదే ఆడియన్స్ సాయి పల్లవిని బ్యాన్ చేయాలి అంటున్నారు. అనడమే కాదు.. ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు కూడా. దీనికి కారణం గతంలో ఇండియన్ ఆర్మీ గురించి సాయిపల్లవి చేసిన కామెంట్స్. విరాటపర్వం సినిమా సమయంలో ఇండియన్ ఆర్మీ గురించి సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేసింది. తనకు యుద్ధాలు అంటే పెద్దగా నచ్చవని అలాంటి వేని ప్రపంచాన్ని తాను కోరుకుంటానని చెప్పింది.
మనం పాకిస్థాన్ వాళ్లను ఎలా టెర్రరిస్టులుగా చూస్తున్నామో.. పాకిస్థాన్ కూడా ఇండియన్ ఆర్మీని టెర్రరిస్ట్ల్లానే చూస్తుంది. ఎవరి ఆలోచనా విధానం వాళ్లది. వాళ్లను మనం తప్పు పట్టలేం అంటూ చెప్పింది సాయి పల్లవి. అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ పెద్ద ఎత్తున సీరియస్ అయ్యారు. ఇప్పుడు అదే టాపిక్ మీద సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారు. అప్పటి వీడియోను ఇప్పుడు మళ్లీ వైరల్ చేయడానికి కారణం సాయి పల్లవి చేసిన లేటెస్ట్ ఫిలిం. కేప్టెన్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా వస్తున్న అమరన్ సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి నటిస్తోంది. ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. ఒకప్పుడు ఆర్మీ గురించి తప్పుగా మాట్లాడిన సాయి పల్లవి ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ భార్య క్యారెక్టర్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ ట్రెండింగ్ గురించి అమరన్ టీం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.