దేవర సినిమాతో ఎన్టీఆర్ లెక్క మారింది. ఎవడు ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా దేవర జాతర ఓ రేంజ్ లో ఉంది. సినిమాపై నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సరే దేవర వసూళ్లు మాత్రం ఆగలేదు. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు వసూళ్ళకు సరిగా సెట్ అయింది. వెయ్యి కోట్లు వసూళ్లు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ కు ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ భారీగా ఉండేది. కాని ఇప్పుడు మాత్రం ఇతర భాషల్లో ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది.
ముఖ్యంగా కన్నడలో ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూసారు. కొన్ని చోట్ల బ్లాక్ లో దేవర సినిమా టికెట్ లు 3 వేల వరకు అమ్ముడు అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో. ఇక ఎన్టీఆర్ ఈ మధ్య కన్నడ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. తన తల్లితో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక కూడా వెళ్లి వచ్చాడు. అక్కడి డైరెక్టర్ లు హీరోలతో ఎక్కువగా మమేకం అవుతున్నాడు తారక్. ఇప్పుడు కన్నడ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరులో ఫ్లాట్ కూడా కొనడానికి రెడీ అయిపోయాడు తారక్.
ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ ను ఇప్పటికే సెలెక్ట్ చేసినట్టు కూడా సమాచారం. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఎన్టీఆర్ ఫ్లాట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చదరపు అడుగు 14 వేల వరకు ఉంది. ఇందిరా నగర్ లో కూడా ఎన్టీఆర్ ఫ్లాట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సీబీడీకి కర్ణాటక అసెంబ్లీకి ఆరు కిలోమీటర్లు ఉంటుంది. అక్కడే ఎక్కువగా ధనవంతులు కూడా ఉంటారు. అందుకే అక్కడ ఫ్లాట్ కోసం ఎన్టీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనే ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా కన్నడ అమ్మాయి కావడం విశేషం.