Bhola Shankar: ఏంటి BRO.. ఇలా అయ్యింది..?

అయినా ఎప్పుడో 8 ఏళ్ల క్రితం వచ్చిన అజిత్ వేదాళం మూవీని తెలుగులో రిమేక్ చేయటమే తప్పు. అంత ఔట్ డేటెడ్ కథని అప్ డేట్ చేశారా అంటే అదీ లేదు. అందులోనూ 12 సంవత్సరాల క్రితమే మెగాఫోన్‌ని పక్కన పెట్టిన మోహర్ రమేష్ చేతిలో పెట్టారు. ఫలితం ఇది మరో శక్తి అంటున్నారు.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 05:50 PM IST

Bhola Shankar: భోళా శంకర్ రిజల్ట్ రివర్స్ అయనట్టేనా..? టీజర్ పేలనప్పుడు మోహర్ రమేష్ కొంపముంచేలా ఉన్నాడన్నారు. తర్వాత ట్రైలర్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందన్నారు. కాని థియేటర్స్‌లో బొమ్మ పడ్డాక దిమ్మ తిరిగిపోయింది. అయినా ఎప్పుడో 8 ఏళ్ల క్రితం వచ్చిన అజిత్ వేదాళం మూవీని తెలుగులో రిమేక్ చేయటమే తప్పు. అంత ఔట్ డేటెడ్ కథని అప్ డేట్ చేశారా అంటే అదీ లేదు.

అందులోనూ 12 సంవత్సరాల క్రితమే మెగాఫోన్‌ని పక్కన పెట్టిన మోహర్ రమేష్ చేతిలో పెట్టారు. ఫలితం ఇది మరో శక్తి అంటున్నారు. అసలు వర్షన్ వేదాళమే అంత గొప్ప మూవీ కాదంటారు. అజిత్ పెర్ఫామెన్స్ లేకపోతే మూలకు పడిపోవాల్సిన సినిమా అది అంటూ అప్పట్లోనే కామెంట్లొచ్చాయి. అంతేనా.. నిజానికి వెంకీ మూవీ తులసికి కాపీనే వేదాళం అని కూడా అన్నారు. ఇన్ని వంకలున్న కథను ముట్టుకోవటమే తప్పు. అలాంటిది ముట్టుకుని చిరు తప్పు చేశాడు. మోహర్ రమేష్‌ని నమ్మి మరింత రిస్క్ చేశాడు. హైదరాబాద్ వదిలి కలకత్తా చేరుకునే హీరో.. అక్కడ కొత్త జీవితం.. చెల్లిని కాలేజ్‌లో చేర్పించి విలన్ల వేట మొదలు పెడతాడు. హీరోయిన్ తమన్నా కంట్లో పడగానే ఫ్లాష్ బ్యాక్ విప్పేస్తాడు. అచ్చంగా భాషా, తులసి కథలాంటిదే. అక్కడ ఆటో, ఇక్కడ టాక్సీ.. ఇక ఈ స్టోరీ లైన్‌లానే భోళా శంకర్ మేకింగ్ కూడా ఔట్ డేటెడ్‌గా ఉండటం, మహతి స్వరసాగర్ పాటలు ఏడుపు తెప్పించటం చూస్తే భోళా మూవీకి కూడా బ్రో లానే పంచ్ పడిందంటున్నారు.

బ్రో కూడా రిలీజ్ కిముందు పొలిటికల్‌గా వార్‌కి వెల్‌కమ్ చెప్పింది. రిజల్ట్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు భోళా శంకర్ కూడా విడుదలకు ముందు వివాదంలో చిక్కుకుంది. విడుదలయ్యాక సినిమా టాక్ షాక్ ఇచ్చింది. ఎందుకో కాని.. మెగా బ్రదర్స్‌కి ఇప్పుడు పెద్దగా టైం కలిసొస్తున్నట్టు లేదు.