పుష్ప 3 వారం కి.. మెగా మీట్ కలిసొచ్చిందా…? రికార్డుల మోత..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా కూడా తుక్కు రేగ్గోడుతుంది. సినిమా రిలీజ్ అయి పది రోజులు దాటినా కూడా వసూళ్ళ స్పీడ్ మాత్రం ఎక్కడా స్లో కాలేదు.

  • Written By:
  • Updated On - December 16, 2024 / 05:54 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా కూడా తుక్కు రేగ్గోడుతుంది. సినిమా రిలీజ్ అయి పది రోజులు దాటినా కూడా వసూళ్ళ స్పీడ్ మాత్రం ఎక్కడా స్లో కాలేదు. ఇండియా వైడ్ గా ఎవరూ ఊహించని రేంజ్ లో 11 వ రోజు వసూళ్లు సాధించింది ఈ సినిమా. అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నార్త్ ఇండియాలో షేక్ ఆడిస్తోంది. ఇండస్ట్రీలో బాక్సాఫీస్ లెక్కలను ట్రాక్ చేసే ఓ వెబ్ సైట్ ఈ లెక్కలు బయటపెట్టింది. ఆదివారం వసూళ్లు చూస్తే… కొన్ని లెక్కలు వర్కౌట్ అయినట్టుగానే కనపడుతోంది.

ఇండియాలో ఆదివారం ఈ సినిమా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో అన్ని భాషలకు కలిపి పుష్ప 2 ఇండియా కలెక్షన్స్ 900.5 కోట్లు దాటాయి. మొదటి వారం ముగిసే సమయానికి, పుష్ప 2 రూ 725.8 కోట్లు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకు మౌత్ టాక్ ప్లస్ అయింది. సినిమా రిలీజ్ అయిన రెండవ శనివారం నుంచి వసూళ్లు భారీగా పెరిగాయి. శుక్రవారం కంటే… బాక్సాఫీస్ కలెక్షన్లలో 73.90 శాతం పెరిగిందని జాతీయ మీడియా వెల్లడించింది. పుష్ప 2 హిందీ వెర్షన్ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.

ఆదివారం అంటే డిసెంబర్ 15న 55 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ 16 కోట్లు, తమిళంలో 3 కోట్లు వసూలు చేసింది. కన్నడ వెర్షన్ 0.6 కోట్లు, మలయాళం వెర్షన్ 0.4 కోట్లు వసూలు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రకటించిన లెక్కల ప్రకారం, శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1292 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 55.96 శాతం ఆక్యుపెన్సీని నమోదు అయింది. ఈవినింగ్, మధ్యాహ్నం షోస్ కు ఎక్కువగా క్రేజ్ ఉన్నట్టు జాతీయ మీడియాతో చెప్తోంది. సినిమా ఆక్యుపెన్సీ పరంగా హైదరాబాద్, విజయవాడలు ముందంజలో ఉన్నాయి. హిందీ వెర్షన్ విషయానికొస్తే, ఈ చిత్రం ఆదివారం యావరేజ్ న 61.29 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

ఇక 542 షోలతో గుజరాత్ లో ఈ సినిమా ప్యూర్ డామినేషన్ కనపడింది. సూరత్ లో అత్యధికంగా 76,50 శాతం ఆక్యుపెన్సీని నమోదు అయింది. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, జైపూర్ మరియు పూణే ఉన్నాయి . ముంబైలో 1248 షోలతో 69.75 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 1591 షోలతో 49.50 శాతం నమోదు అయింది. సినిమా రిలీజ్ అయిన రెండవ శుక్రవారం రూ 36.4 కోట్లు, రెండవ శనివారం ₹63.3 కోట్లు హిందీలో వసూలు చేసింది. తెలుగు వెర్షన్ లో రూ279.35 కోట్లు వసూలు చేసింది పుష్ప 2. తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు రూ. 48.1 కోట్లు, 13.4 కోట్లు, 6.55 కోట్లు వసూలు చేసాయి. ఈ చిత్రం విడుదలైన 11వ రోజున రూ.100 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్ రూ.1322 కోట్లకు చేరుకుంది. దీనితో బన్నీ అరెస్ట్ సింపతి అలాగే మెగాస్టార్ ఇంటికి వెళ్ళడం వర్కౌట్ అయింది అంటున్నాయి సినీ వర్గాలు.