Kalki.. Prabhas : శ్రీ మహావిష్ణువు 11వ అవతారం కల్కి.. ప్రభాస్‌ సినిమాలో ఇదే చూపించబోతున్నారా!

ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి పేరే వినిస్తోంది. టాప్‌ స్టార్స్‌తో కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో.. ఈ సినిమా గురించి నాగ్‌ అశ్విన్‌ క్రియేట్‌ చేసిన హైప్‌ అలాంటిది.

 

 

 

ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి పేరే వినిస్తోంది. టాప్‌ స్టార్స్‌తో కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో.. ఈ సినిమా గురించి నాగ్‌ అశ్విన్‌ క్రియేట్‌ చేసిన హైప్‌ అలాంటిది. ఈ నేపథ్యంలో అసలు కల్కి అంటే ఎవరు? ఆ కథేంటి అని మాట్లాడుకుంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా పరిగణిస్తారు. మన మైథాలజీ ప్రకారం ఇప్పటి వరకూ నాలుగు యుగాలు ఉన్నాయి. అవి.. కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగం.

ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. మన పురాణాల ప్రకారం ఈ కలియుగం ముగింపులో పాపం విపరీతంగా పెరిగిపోతుంది.. ఆ సమయంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. 4లక్షల 27 వేల సంవత్సరాల తరువాత ఇప్పుడు కల్కి మరోసారి జన్మించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని మొర్దాబాద్ సమీపంలోని సంభాల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మింస్తాడని పురాణాల్లో ఉంది. తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారట. వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో కల్కికి సహాయం చేస్తారట. కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. తనకు వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది.

కల్కి తండ్రి పేరు విష్ణుయాష్, తల్లి పేరు సుమతి. కల్కి దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ. రెండో భార్య వైష్ణవి శక్తి రూపం. వైష్ణవి అంటే తల్లి వైష్ణో దేవి రామావతార కాలం నుండి భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది. కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటాడు. లార్డ్ కల్కికి జై, విజయ్, మేఘ్వాల్, బలాహక్ అనే నలుగురు కొడుకులు ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణం ప్రకారం సత్య యుగంలోని సంధి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతం, విష్ణు పురాణం, బ్రహ్మ వైవర్త పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.

కలి యుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతుంటారు. స్వేద గ్రంధుల నుంచి రక్తం కారే స్థాయికి చేరుకుంటారు. మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోతారు. తప్పులు చేసే వారిని కూడా క్షమిస్తారు. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వంటి మాటలు వినిపించవు. చిన్నారులను, మహిళలను, గోమాతలను కఠినంగా హింసిస్తారు. కన్నవారిని రోడ్డుపాలు చేసి, వారు కష్టపడుతున్నా ఏం పట్టనట్టు సంతోషంగా జీవిస్తారు. సైన్స్ ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టినా, అది కేవలం ఒక భాగం మాత్రమే.. మిగిలిన భాగమంతా దేవుడే అని గుర్తించలేరు. చెట్లు బలహీనపడి, డ్యామ్‌లో నీరు అనేదే కనిపించకుండా పోతుంది. సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది.

బ్రాహ్మణులు దైవారాధానను వదిలేస్తారు. మద్యం, మాంసం తీసుకోవడం మొదలెడతారు. ప్రతి మనిషిలోనూ గుణాలు రాక్షస రూపంలో మారతాయి. ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి, నాలుగో పాదంలో మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు కల్కి వస్తాడు. అప్పటినుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువే లోకాన్ని పాలిస్తాడు. మన పురాణాల ప్రకారం ఇదీ కల్కీ కథ. ప్రభాస్‌సి నిమాలో కూడా ఇదే కల్కి అవతారాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.