Shruti Haasan: ముచ్చటగా మూడోసారి.. బాయ్‌ఫ్రెండ్‌కు బైబై చెప్పిన శృతి హాసన్..

శృతి కొన్నేళ్లుగా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో డేటింగ్‌లో ఉంది. ఈ సంగతి బైటకు చెప్పకపోయినా.. ఇద్దరూ కలిసే అన్ని చోట్లకు వెళ్లేవారు. ప్రియుడు ఎయిర్‌పోర్ట్‌ వరకు వచ్చి మరీ సాగనంపేవాడు. ముద్దులు కురిపించుకున్న వీడియోలను పోస్ట్‌ చేస్తూ హద్దులు కూడా దాటారు.

  • Written By:
  • Updated On - April 27, 2024 / 04:25 PM IST

Shruti Haasan: శృతిహాసన్‌ మరోసారి ఒంటరి అయింది. ప్రియుడు శాంతాను హజారికాతో బ్రేకప్‌ అయింది. విడిపోయామని ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ చెప్పకపోయినా వీళ్ల ఇన్‌స్టాగ్రామ్‌ మాత్రం.. ఈ బ్రేకప్‌ సీక్రెట్‌ను బైటపెట్టింది. ఇప్పుడు నాలుగో ప్రియుడు కోసం వెదుకుతోంది శృతిహాసన్. ప్రేమించిన ప్రతిసారీ లవ్‌ఫెయిల్యూర్‌ కావడంతో ప్రేమ మీద శృతికి నమ్మకం పోయింది. అందుకే ఎంచక్కా పెళ్లంటే ఇంట్రెస్ట్ చూపించకుండా.. రిలేషన్‌తో సరిపెట్టుకుంటోంది. ఈ కొత్త బ్రేకప్‌తో పెళ్లి అంటే లేని నమ్మకాన్ని మరింత పెంచింది.

Mahesh Babu : మళ్లీ విదేశాలకు మహేష్ బాబు, రాజమౌళి

శృతి కొన్నేళ్లుగా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో డేటింగ్‌లో ఉంది. ఈ సంగతి బైటకు చెప్పకపోయినా.. ఇద్దరూ కలిసే అన్ని చోట్లకు వెళ్లేవారు. ప్రియుడు ఎయిర్‌పోర్ట్‌ వరకు వచ్చి మరీ సాగనంపేవాడు. ముద్దులు కురిపించుకున్న వీడియోలను పోస్ట్‌ చేస్తూ హద్దులు కూడా దాటారు. ఇప్పుడీ ఈ ముద్దులకే కాదు.. రిలేషన్‌కే బ్రేకప్‌ పడింది. ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌‌ఫాలో కావడమే కాకుండా.. శాంతనుతో దిగిన ఫొటోలను శృతిహాసన్‌ డిలీట్‌ చేసింది. దీంతో.. వీళ్ల డేటింగ్‌ కథకు ఎండ్‌ కార్డ్‌ పడినట్టే లెక్క. ఇంతకుముందు శృతి ఎక్కడకు వెళ్లినా.. వెనకాల శాంతను ఉండాల్సిందే. కానీ.. రీసెంట్‌గా జరిగిన ‘హీరా మండీ’ ప్రీమియర్‌ షోకు వెనకాల ప్రియుడిని తీసుకురాలేదు. ఈ ఇద్దరూ విడిపోయి నెల రోజులైందని ముంబై మీడియాలో ప్రచారం జరుగుతోంది. శృతిహాసన్‌కు ఇది మూడో బ్రేకప్‌. ముందుగా సిద్దార్థతో లవ్‌స్టోరీ నడిపింది. ఆ తర్వాత ఇటాలియన్‌ యాక్టర్‌ మైఖేల్‌తో ప్రేమకథ పెళ్లి దాకా వెళ్లి యూ టర్న్‌ తీసుకుంది.

శృతి, మైఖేల్‌ ప్రేమకు కమల్‌ హాసన్ ఆశీస్సులు దక్కినా.. చివరికి బ్రేకప్‌ బాట పట్టింది. సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యాడంటే.. బ్రేకప్‌ అయినట్టే లెక్క. విడిపోతున్నామని సమంత, చైతు చెప్పినా.. అంతకు ముందే.. సామ్‌ చైతును అన్‌ ఫాలో చేసింది. అలాగే నీహారిక, చైతన్య జొన్నలగడ్డ సైతం ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. బ్రేకప్‌ శృతికి సింపతీ తీసుకురాలేదు కదా.. పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కలిసున్నామా..? తిరిగామా..? నచ్చకపోతే విడిపోయామా..? అన్న కాన్సెప్ట్‌తో శృతి ఉండటమే ఇందుకు కారణం కావచ్చు. కలిసున్నారు.. ఇప్పుడు విడిపోయారు. ఇది లవ్‌ బ్రేకప్‌ కాదని.. కేవలం రిలేషన్‌ బ్రేకప్‌ మాత్రమేనని.. వాళ్లకి లేని బాధ మనకెందుకంటూ.. అయ్యో పాపం అని మెస్సేజ్ చేసిన వాళ్లకు మరికొందరు కౌంటర్‌ ఇస్తున్నారు. శృతి హాసన్‌ను నెక్ట్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు.