Shruti Haasan: ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. దానికి తగ్గట్లే హీరోయిన్స్ మైండ్‌సెట్ కూడా మారుతోంది. కథ డిమాండ్ చేస్తే ఏ రోల్ చేయడానికైనా సై అంటున్నారు. బోల్డ్ కారెక్టర్స్ ఆఫర్ చేస్తే రొమాన్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి అటెంప్ట్‌ని హాలీవుడ్ లో చేస్తోంది శృతి హాసన్. టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్‌లో అలరించిన శ్రుతిహాసన్ ఇప్పుడు హాలీవుడ్‌లో లాంచ్ అవుతోంది. ‘ది ఐ’ అనే సినిమాతో అక్కడ తెరంగేట్రం చేస్తోంది.
వైవిథ్యమైన పాత్రలు పోషించడం అంటే శృతికి ఎంతో ఇష్టం. అందుకే హాలీవుడ్‌లోనూ అలాంటి అటెంప్ట్ చేస్తోంది. ది ఐ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో మార్క్ రౌలీకి జోడిగా శృతి నటిస్తోంది. ఇందులో ఈ ఇద్దరు భార్యాభర్తల పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే శ్రుతి హాసన్ రోల్ ఎలా ఉంటుందన్నది రివీల్ అయింది. చనిపోయిన భర్త అస్తికల్ని ఓ ద్వీపంలో కలిపేందుకు ఒంటరిగా ఆమె ఎలా ప్రయాణం చేసింది? భర్త మరణానికి కారణం ఎవరు? అని తెలుసుకునే మహిళ పాత్రతో ఈచిత్రం తెరకెక్కింది. ‘ది ఐ’ సినిమాలో శృతిహాసన్ భార్యపాత్రని అత్యంత రొమాంటిక్‌గా తెరకెక్కించడట డైరెక్టర్.
మార్క్ రౌలీతో అమ్మడు ఇంటిమేట్ సన్నివేశాల్లో చెలరేగిపోయిందట. భర్తతో బెడ్ రూమ్ సన్నివేశాలు రక్తికట్టించడంలో శ్రుతి హాసన్ ఏమాత్రం మోహమాట పడలేదని తెలుస్తోంది. ‘క్వాంటికో’ సిరీస్‌లో కదిలే కారులో పీసీ రొమాన్స్ చేస్తే.. శృతి హాసన్ మాత్రం బెడ్ రూమ్‌లోనే కావాల్సినంత రొమాన్స్‌ని పండించిందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. పాత్ర కోసం శృతిహాసన్ పరిమితులు విధించే నటికాదు. పైగా ఇది హాలీవుడ్ మూవీ కాబట్టి బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి అంటే ది ఐ రిలీజ్ వరకు వైయిట్ చేయాల్సిందే.