టాలెంటెడ్ హీరో వారసురాలు శ్రుతి హాసన్ తండ్రిని మించిపోయింది. ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు. పాటలు పాడేస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఈ ప్రతిభ ముందు ఎన్టీఆర్ రికార్డ్ బద్దలైపోయింది. శ్రుతిహాసన్‌కు గ్లామర్ రోల్స్ వస్తున్నాయేగానీ.. సరైన క్యారెక్టర్ పడడం లేదు. లేదంటే.. పెర్‌ఫార్మెన్స్‌తోనూ ఇంప్రెస్ చేసేసేది. ఈమె సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టరే అయినా.. యాక్టింగ్‌పై ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ చేస్తూ.. అప్పుడప్పుడూ.. తనలోని సింగర్‌ను బైటకు తెస్తుంది.
శ్రుతిహాసన్ తారక్ రికార్డ్‌ను బ్రేక్ చేసేసింది. ఆర్‌ఆర్‌ఆర్ ఐదు భాషల్లో రిలీజ్ అయితే.. మలయాళం తప్ప హిందీ, తెలుగు, తమిళం.. కన్నడ లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు. శృతిహాసన్ ఏకంగా 5 లాంగ్వేజెస్‌లో డబ్బింగ్ చెప్పింది. శ్రుతి అప్‌కమింగ్ మూవీ సలార్ డబ్బింగ్ పనిలో బిజీగా వుంది. ఇప్పటికే మూడు భాషలు పూర్తయ్యాయని.. ఇంకో రెండు లాంగ్వేజెస్ బ్యాలెన్స్ వున్నాయంటూ.. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది శ్రుతి. సాధారణంగా మలయాళంలో వాయిస్ చెప్పే ధైర్యం చెయ్యరు. కష్టమైన లాంగ్వేజ్ కావడంతో.. ఆర్‌ఆర్‌ఆర్ టైంలో ఎన్టీఆర్ దూరంగా వున్నాడు. కానీ.. ఈ టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతికి అన్ని భాషలూ ఒక్కటే. సలార్ ఇంకో రెండు భాషల్లో డబ్ అయినా.. డబ్బింగ్ అర్టిస్ట్ అవసరం లేకుండా.. వాయిస్ ఇచ్చేస్తుందేమో.