పోస్టర్ తో రెబల్ స్టార్ కు షాక్ ఇచ్చిన సిద్ధూ… 1000 కోట్ల సినిమాకు ఎదురెళ్తున్నాడు

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు ఎదురు వెళ్లాలంటే బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు వణికిపోయే పరిస్థితి. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా కూడా వేసుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - December 19, 2024 / 12:05 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు ఎదురు వెళ్లాలంటే బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు వణికిపోయే పరిస్థితి. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా కూడా వేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే థియేటర్ లు భారీగా లాక్ అయిపోవడం అలాగే జనాల్లో కూడా పిచ్చ క్రేజ్ ఉండటంతో స్టార్ హీరోలు ఏం చేయాలో అర్థం కాక తమ సినిమాలను రిలీజ్ చేయాలంటే భయపడే పరిస్థితి. సల్మాన్ ఖాన్ కూడా తన సికిందర్ సినిమా విషయంలో ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడు. రంజాన్ కు ఆ సినిమా రిలీజ్ చేయాలని ముందు భావించాడు.

కాని ప్రభాస్ కారణంగా రిలీజ్ ను ముందుకు జరపాలని రెడీ అవుతున్నాడు. అలాంటిది టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ మాత్రం తన సినిమాను ప్రభాస్ సినిమా రోజునే రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేసే సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. సిద్దు ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రానుంది. లేటెస్ట్ గా దీని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం సిద్దు జొన్నలగడ్డ దాదాపు ఏడాదిన్నర నుంచి కష్టపడుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యే స్టేజ్ కు వచ్చింది ఈ సినిమా. 2025 ఏప్రిల్ 10న ప్రభాస్ సినిమా కూడా రానుంది. మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ అనే సినిమాను ప్రభాస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే తేదీని సిద్దు జొన్నలగడ్డ కూడా లాక్ చేసుకోవడంతో రాజా సాబ్ రిలీజ్ వాయిదా పడిందా అనే అనుమానాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ గాయం కారణంగా సినిమా షూటింగ్ కు దూరమయ్యాడు. ఎలాగైనా ఏప్రిల్ 10న సినిమాను రిలీజ్ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నాడు ప్రభాస్. గాయంతో సినిమా షూటింగ్ ఖచ్చితంగా వాయిదా పడే ఛాన్స్ ఉందని అందుకే అదే రోజున సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేస్తున్నాడని అంటున్నారు. ప్రభాస్ సినిమా ఉంటే థియేటర్లు దొరకడం కచ్చితంగా కష్టమే. మరి అంత ధైర్యంగా సిద్దు జొన్నలగడ్డ ఆ డేట్ ని ఎలా ఫిక్స్ చేశాడో తెలియాలి. రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ సినిమాను ప్రకటించినప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా రిలీజ్ డేట్ అదే అని చెప్పాయి. కానీ ఇప్పుడు అదే రోజున సిద్దు జొన్నలగడ్డ సినిమా రిలీజ్ ఉండడంతో అసలు ఏం జరుగుతుందనేది రెబల్ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు.