సైలెంట్ గా టాలీవుడ్ సింగర్స్ పెళ్లి, సినిమా వాళ్లకు దూరంగా

టాలీవుడ్ లో పెళ్లి సందడి ఎక్కువైంది. యువ నటులు, సింగర్స్ ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోగా... నారా రోహిత్, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 06:15 PM IST

టాలీవుడ్ లో పెళ్లి సందడి ఎక్కువైంది. యువ నటులు, సింగర్స్ ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోగా… నారా రోహిత్, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే అక్కినేని హీరో సుశాంత్ కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ క్రిష్ కూడా ఇటీవల సైలెంట్ గా వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య వివాహం డిసెంబర్ లో జరగనుంది. తండ్రి మరణంతో… నారా రోహిత్ నిశ్చితార్ధం మాత్రం వాయిదా పడే ఛాన్స్ కనపడుతోంది.

ఇక సింగర్లు రమ్య బెహరా, అనురాగ్ కులకర్నీ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. శుక్రవారం నాడు వీరిద్దరి వివాహాం చాలా ఘనంగా నిర్వహించారు పెద్దలు. హిందూ సాంప్రదాయంతో అత్యంత ఘనంగా జరిగినా సైలెంట్ గా చేసుకున్నారు. అతి కొద్ది మందిని మాత్రమే పిలిచారు. సినిమా పరిశ్రమ నుంచి ఎవరిని ఆహ్వానించలేదు. అయితే ఇది ప్రేమ వివాహం అనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కొంత కాలం నుంచి డేటింగ్ కూడా చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.

సోషల్ మీడియాలో కూడా ఈ వివాహం గురించి ఎక్కడా ఈ ఇద్దరూ పోస్ట్ చేయకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకోవడం గమనార్హం. అనురాగ్ కులకర్ణి ఒకప్పుడు చాలా బిజీగా ఉండేవాడు. స్టార్ హీరోల సినిమాల్లో సాంగ్స్ తో పాటుగా… ఆశా పాశం సాంగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. లవ్ సాంగ్స్ విషయంలో అనురాగ్ కు మంచి ఇమేజ్ వచ్చింది. పిల్లా రా, చూసీ చూడంగానే అనే సాంగ్స్ తో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ప్రణవాలయ అనే సాంగ్ కూడా అనురాగ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కాస్త ఛాన్స్ లు తగ్గాయి అనే టాక్ వస్తోంది.

ఇక రమ్య బెహరకు సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ ఉంది. తెలుగు అమ్మాయిలా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఈమె టాలెంట్ కు తగ్గ ఛాన్స్ లు రాలేదనే కామెంట్స్ కూడా వింటూనే ఉంటాం. మెలోడి సాంగ్స్ విషయంలో రమ్య క్వీన్ గా చెప్పవచ్చు. బాహుబలి సినిమాలో ఆమెకు మంచి పేరు వచ్చింది. పలు ఈవెంట్స్ లో ఆమె పాటలకు మంచి మార్కులు పడ్డాయి. పాడుతా తీయగా నుంచి సింగర్ అయిన రమ్య… స్వరాభిషేకంలో ఎన్నో ఎపిసోడ్స్ లో సాంగ్స్ పాడి… దివంగత దిగ్గజ సింగర్ ఎస్పీ బాలు మన్నలను పొందారు. ఈ ఇద్దరి పెళ్ళికి తోటి సింగర్స్ ను కూడా ఆహ్వానించలేదు. సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపలేదు. హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ కనీసం సోషల్ మీడియాలో అయినా తమ పెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.