యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ఆసక్తి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ బిజీగా ఉండటంతో ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పుడు గట్టిగానే కష్టపడుతున్నాడు. దేవర సినిమా షూట్ అయిన వెంటనే ఎన్టీఆర్… ఈ సినిమా షూట్ మొదలుపెట్టాడు. అయితే వార్ 2 సినిమా ఉన్న నేపధ్యంలో సినిమా కాస్త ఆలస్యం అవుతోంది అంటున్నారు.
అయితే ఇతర నటులతో షూట్ ని మొదలుపెట్టి ఎన్టీఆర్ తో షూట్ మాత్రం జనవరి నుంచి మొదలుపెట్టాలని ప్రశాంత్ భావిస్తున్నాడు. ఇందుకోసం ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఓ సెట్ కూడా వేయడానికి ప్లాన్ చేసాడు. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది. బంగ్లాదేశ్ లో స్థిరపడి కష్టాలు పడుతున్న తెలుగు వాళ్ళ కోసం హీరో కష్టపడతాడు. ఆ నేపధ్యంలోనే సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్. ఇక ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ కూడా గట్టిగానే ఉంది. విలన్ గా బాబీ డియోల్ ని తీసుకుంటున్నాడు.
అలాగే కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత తో పాటుగా అక్కడి స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ను కీలక రోల్ కోసం తీసుకుంటున్నాడు. కన్నడ మార్కెట్ మీద ఎక్కువగా ఎన్టీఆర్ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్… తో గతంలో నటించిన మాజీ హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం భూమిక కోసం ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ రోల్ రెడీ చేసాడని… ఆమె కూడా అందుకు ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమాలో భూమిక… ఎన్టీఆర్ కు అక్కగా నటిస్తారని టాక్.
వీళ్ళు ఇద్దరూ కలిసి సింహాద్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఎన్టీఆర్ కూడా… భూమిక రోల్ గురించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… ప్రశాంత్ నీల్ ఆమెతో షూట్ కూడా మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె బంగ్లాదేశ్ లో భర్తతో కలిసి కష్టాలు పడుతూ ఉంటారట. ఆ పాత్రకు ఇంకా మెరుగులు దిద్దిన తర్వాత షూట్ ను మొదలుపెట్టే అవకాశం ఉంది. సినిమా ఓపెనింగ్ షాట్ ఆమెతో ఉండే అవకాశం ఉందని టాక్. ఏది ఎలా ఉన్నా ఈ సినిమాపై మాత్రం అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమాను రెండేళ్ళ తర్వాత విడుదల చేయనున్నారు.