RAMOJI LOSS : వీటితో నష్టం… అయినా ఇష్టం.. ఆ ప్రాజెక్టులతో రామోజీకి లాస్

సాధారణంగా వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు నష్టం వస్తే... అంతటితో వదిలేస్తారు చాలామంది. ఇక కంటిన్యూ చేసే సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారు.

సాధారణంగా వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు నష్టం వస్తే… అంతటితో వదిలేస్తారు చాలామంది. ఇక కంటిన్యూ చేసే సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారు. కానీ రామోజీరావు (Ramoji Rao) మాత్రం నష్టం వస్తున్నా సరే… కొన్ని ప్రాజెక్టులను కొనసాగించారు. తాను ఇష్టపడి ప్రారంభించినా… అవి జనానికి అవసరం అనుకొని అలాగే నడిపించారు. ఈటీవీ (ETV) లో మాల్గుడి కథల పేరుతో సీరియల్ ను ప్రతి ఆదివారం ప్రసారం చేశారు. వీటికి మొదట్లో ఆదరణ లభించినా … ఆ తర్వాత పోటీగా కొన్ని ఛానెళ్ళు స్టార్ట్ చేశాయి. దాంతో ప్రేక్షకుల సంఖ్య తగ్గగా రేటింగ్స్ పడిపోయాయి. నష్టాలు వచ్చినా… యాడ్స్ రాకపోయినా మాల్గుడి కథల సిరీస్ ను రామోజీరావు ఈటీవీలో కంటిన్యూ చేశారు.

ఇలాంటిదే అమరావతి కథలు, పంచతంత్ర కథలు కూడా. అమరావతి కథలను (Amaravati kathalu) రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) లోనే రూపొందించారు. సమాజ హితం కోసమే వీటిని ప్రసారం చేశారు. వీటికి కూడా యాడ్స్ రాలేదు. ఈతరం పిల్లలకు పంచతంత్రం కథల విలువను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సీరిస్ స్టార్ట్ చేశారు. తోలుబొమ్మలాటల ద్వారా పంచతంత్రం ఎపిసోడ్స్ కొనసాగించారు. వీటికి కూడా యాడ్స్ రాకపోయినా… ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారం అవుతూనే ఉండేవి.

ఈటీవీలో ప్రసారమైన భాగవతం ఎడిసోడ్స్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మహాభారతం (Mahabharata) లోని కీలకఘట్టాలతో బావు దర్శకత్వం, రమణ సాహిత్యంతో 350 ఎపిసోడ్లకు ప్లాన్ చేశారు. అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఇబ్బందులు ఎదురయ్యాయి. బాపును ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని రామోజీ కొడుకు సుమన్ కోరారు. ఆ తర్వాత సుమన్ దర్శకత్వంలో భాగవతం కొనసాగింది. అంతగా ఆకట్టుకోకపోవడంతో… ఆదాయం రాలేదు. టీవీల్లో సీరియల్స్ పరిస్థితి అలా ఉంటే… రామోజీ రావు ప్రత్యేకంగా తెలుగు వారి కోసం తెలుగు వెలుగు పత్రిక, పిల్లల కోసం బాల భారతం అనే రెండు పుస్తకాలు తెచ్చారు.

బాలభారతం మొదట్లో పుస్తకంగా రాగా… ఆ తర్వాత ఇదే పేరుతో ప్రత్యేక ఛానెల్ ని ఓపెన్ చేశారు. దీనికి కూడా పెద్దగా లాభాలు లేవు. ఇక తెలుగు వెలుగు మాసపత్రిక. 2015లో తెచ్చిన మేగజైన్ ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగును బతికించాలన్న తాపత్రయంతో రామోజీరావు ఎంతో ఇష్టంతో తెచ్చిన పత్రిక ఇది. కొన్నాళ్ళు ఆదరణ పొందింది. తర్వాత అమ్మకాలు లేకపోవడంతో… ప్రింటింగ్ ఆపేసి ఆన్ లైన్ మేగజైన్ గా కొనసాగిస్తున్నారు. రామోజీరావుకి నష్టాలు వచ్చినా సరే… తన ఇష్టంతో పాటు జనానికి ఎంతో కొంత ఉపయోగపడతాయన్న ఉద్దేశ్యంతో వాటిని కొనసాగించారు. మిగతా వ్యాపారవేత్తలకు భిన్నంగా ఆలోచించారు రామోజీరావు.