ఇటింత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు, సింగిల్ సీన్ ఎన్టీఆర్ కి షాక్ ఇస్తోంది. తన అభిమానికి సాయం చేయబోతే, తనకే బెడిసి కొట్టింది. చావుకి దగ్గర్లో ఉన్నాడని చివరి క్షనాల్లో తారక్ ని చూడాలని తపించాడో ఫ్యాన్… బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తనని ఎన్టీఆర్ ఫోన్ చేసి ఓదార్చాడు.. తన అభిమానికోసం ఓ హీరోగా యోగ క్షేమాలు ఆడిగి తెలుసుకున్నాడు. అలానే ఫ్యాన్స్ రూపంలో హెల్ప్ కూడా చేశాడు….అంతవరకు బానే ఉంది.. సడన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసుకి, ఎన్టీఆర్ సాయానికి ముడిపెట్టి ట్రోలింగ్ చేయటం షాకింగ్ న్యూస్ గామారింది. ఒకవైపు అభిమాని కదాని సాయమందిస్తే, అతని ఫ్యామిలీ ఎన్టీఆర్ ని మరోలా బ్లాక్ మేయిల్ చేసిందనే చర్చ మొదలైంది. మరో వైపు హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ కి బన్నీ ప్రకటించిన సాయంతో, ఎన్టీఆర్ సాయాన్ని పోల్చటం షాకింగ్ గా మారింది. అలా ట్రోలింగ్ చేయటంతో, ఇదేం పోలికంటూ మరో చర్చ షురూ అయ్యింది. ఇంతకి ఏం జరుగుతోంది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సిర్ తో ఫైట్ చేస్తున్నాడని తెలిసి, తారక్ రియాక్ట్ అయ్యాడు. తనతో ఫోన్ లో మాట్లాడాడు… అంతే అదే పెద్ద తప్పైపోయింది. ఎన్టీఆర్ సాయం చేస్తానని చెప్పి డబ్బు సాయం చేయలేదంటూ, ఆ అభిమాని తల్లి ఇచ్చిన స్టేట్ మెంట్ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ మీద యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ అయ్యింది
విచిత్రం ఏంటంటే ఆ అభిమాని ట్రిట్మెంట్ కి ప్రభుత్వం 11 లక్షలు, టీటీడీ 40 లక్షల సాయం చేస్తే, ఎన్టీఆర్ అభిమానులు రెండున్నర లక్షలు సాయం చేశారు. అయినా తారక్ మాత్రం అంతా చూసుకుంటానని చెప్పి, ఇంకా ఎలాంటి హెల్ప్ చేయలేదని ఆ పేషెంట్ కౌశిక్ తల్లి సరస్వతి స్టేట్ మెంట్ ఇచ్చింది
ఇదే వివాదానికి కారణమైంది. ఎన్టీఆర్ సాయం చేయకూడదనుకుంటే, తన ఫ్యాన్స్ రెండున్నర లక్షలు సాయం చేస్తారా? అది కాకుండా..ఏదో అప్పు పడినట్టు, సాయం చేస్తా అన్న వ్యక్తే మొత్తం చూసుకోవాలంటే ఎలా?
ఇంకా కౌశిక్ కి 20 లక్షల వరకు ట్రీట్మెంట్ కి ఖర్చవుతుందట. అది తారకే చేయాలని, చేస్తా అని చేయలేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి, బ్లాక్ మేయిల్ చేస్తున్నారా? ఇలా కాల్ చేసినందుకు ఇలా తారక్ కి ఇరికిస్తారా అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నటి మాధవి లత అయితే, ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే, నటులు రోడ్డున పడాల్సిందే అనేసింది..
ఇంత జరిగితే, ఈ వ్యవహరాన్ని బన్నీ కేసుకి లింక్ పెడుతున్నారు యాంటీ ఫ్యాన్స్. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట వల్ల చనిపోయిన వ్యక్తి, అలానే హాస్పిటల్ లో పోరాడుతున్న శ్రీతేజ్..వీళ్ల కు ఎన్టీఆర్ సాయం అంశాన్ని ముడిపెడుతున్నారు. 25 లక్షలు ఇస్తానని బన్నీ పది లక్షలిచ్చి చేతులు దులుపుకున్నాడు, అలానే తారక్ చేశాడంటూ కామెంట్లు పెంచారు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ కి బన్నీ అండ్ కో డబ్బు సాయం చేస్తారన్నారంటే అర్ధముంది… కేవలం అభిమాన సాయం కోరాడని, రెండున్నర లక్షలతో పాటు, ఇతర సాయం చేస్తా అన్న తారక్ ని ఇరికించటం ఏంటనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. సందు దొరికింది కదాని యాంటి ఫ్యాన్స్ మాత్రం తారక్ ని ఇలా కూడా ఇరికిస్తున్నారనే కౌంటర్స్ పెరిగిపోతున్నాయి.