తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా “GOAT… ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే టైటిల్ తో వస్తున్న సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు వెంకట ప్రభు ఒక కీలక విషయం బయటపెట్టారు. ఈ సినిమాలో పాట పాడిన ఒక సింగర్ అదే రోజు సాయంత్రం ప్రాణాలు కోల్పోయిందని ఆయన చెప్పి కన్నీరు పెట్టించారు. ఈ సినిమాలో పాట పాడి… అదే రోజు సాయంత్రం ఆమె క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై మాట్లాడిన దర్శకుడు… ఒక రోజు… “చిన్న చిన్న కంగల్” సాంగ్ థీం గురించి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నాకు చెప్పాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పాటను ఆయన సోదరి, గాయని భవతారణితో పాడించాలని నిర్ణయం తీసుకున్నామని… ఆ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యంలో ఉన్నారని, త్వరగా కోలుకుని చెన్నై వచ్చిన తర్వాత పాడతారని ఎదురు చూసామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్యూన్ పూర్తైన రోజున ఆమె మరణించారని… ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో లాల్ సలాం సినిమాలోని ఒక పాటను దివంగత గాయకుడు శాహుల్ హమీద్ గాత్రాన్ని వినిపిస్తే… భవతారణి గాత్రాన్ని ఎందుకు వాడకూడదని అనుకుని ముందుకు వెళ్లామని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏ ఆర్ రహమాన్ ను అడిగి తెలుసుకున్నామని… భవతారణి రా వాయిస్ తీసుకుని మరో సింగర్ ప్రియదర్శిని సహాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్ పుట్ తీసుకొచ్చామని… ట్యూన్ బాగా నచ్చడంతో స్వయంగా విజయ్ ఈ పాటను పాడతాను అని ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఇళయరాజా కుమార్తె అయిన భవతారణి… క్యాన్సర్ చికిత్స కోసం ఈ ఏడాది జనవరిలో శ్రీలంక వెళ్లి అక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలు సినిమాల్లో ఆమె వివిధ పాటలను ఆలపించారు.