Sai Pallavi: మంగ్లీ రిజెక్ట్ చేసిన సినిమాలో సాయిపల్లవి.. ‘ఫిదా’ చేయలేకపోయిన సింగర్!

సింగర్‌గా వెలుగుతూనే హీరోయిన్‌గా కెరీర్లో బిజీగా ఉండాల్సింది మంగ్లీ. కానీ.. తనను పలకరించిన అద్భుతమైన ఆఫర్‌కి అప్పట్లో నో చెప్పేసింది. ఆలస్యంగా బయటపడిన ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ మాత్రం మంగ్లీ హీరోయిన్‌గా ఆ ఆఫర్ రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది అంటున్నారు.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 04:16 PM IST

Sai Pallavi: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్‌గా వచ్చిన ఆఫర్‌ని సింగర్ మంగ్లీ వదిలేసుకుందా..? ఆ సినిమాలో యాక్ట్ చేసి ఉంటే సింగర్ మంగ్లీ ఇప్పుడు హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉండేదా..? ఇంతకీ మంగ్లీ వదిలేసుకున్న ఆఫర్ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బతుకమ్మ, బోనాలు, గణేష్ చతుర్థి, సమ్మక్క సారక్క, శివుడి గీతాలు.. ఇలా ఎన్నో పాటలు పాడి చాలా ఫేమస్ అయింది. మంగ్లీ పాడిన పల్లె పాటలకు వచ్చిన ఆదరణ చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచీ ఆమెకు సినిమాల్లో పాడే ఛాన్సులొచ్చాయి.

Shah Rukh Khan: షారుఖ్ సక్సెస్ సీక్రెట్.. అమ్మవారిని దర్శించుకుంటే హిట్ ఖాయమా!

మంగ్లీ పాడిన పాటంటే ఆ మూవీకే హైలెట్ అన్నంత క్రేజ్ ఉందిప్పుడు. సింగర్‌గా వెలుగుతూనే హీరోయిన్‌గా కెరీర్లో బిజీగా ఉండాల్సింది మంగ్లీ. కానీ.. తనను పలకరించిన అద్భుతమైన ఆఫర్‌కి అప్పట్లో నో చెప్పేసింది. ఆలస్యంగా బయటపడిన ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ మాత్రం మంగ్లీ హీరోయిన్‌గా ఆ ఆఫర్ రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది అంటున్నారు. ఇంతకీ అదే సినిమానో తెలుసా..? భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల.. ఈ డైలాగ్ వినగానే మీకు కళ్లముందు సాయి పల్లవి కనిపిస్తోందా? నిజమే ఇది సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఫిదాలో డైలాగ్. ఆ మూవీ అమ్మడి కెరీర్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అదిరిపోయే క్రేజ్ అందించింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ మంగ్లీని అనుకున్నాడట. ఈ క్యారెక్టర్ కోసం ఆమెను కమ్ముల అప్రోచ్ అయితే.. మంగ్లీ మాత్రం సింపుల్‌గా నో చెప్పేసిందట. తనకు హీరోయిన్ అవ్వాలనే ఆశలేదని తేల్చిచెప్పేసిందట మంగ్లీ. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ చుట్టూ తిరిగిన శేఖర్ కమ్ముల.. చివరకు సాయి పల్లవిని ఫిక్స్ అయ్యాడు. ఫిదాలో ఛాన్స్ మంగ్లీ మిస్ చేసుకుందని తెలిసి అవాక్కవుతున్నారంతా.
మంగ్లీగా ఫేమస్ అయిన ఆమె అసలు పేరు సత్యవతి. ఏపీలోని అనంతరపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తండాలో పేద బంజారా కుటుంబంలో జన్మించిన మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అనంతరం ఎస్వీ విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సులో జాయిన్ అయింది. ఆ తర్వాత తన కెరీర్ మొదలు పెట్టి తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ముందుగా జానపద గీతాలతో ప్రయాణం మొదలుపెట్టిన మంగ్లీ.. ఓ టీవీ ఛానెల్‌లో మాటకారి మంగ్లీ పోగ్రామ్ ద్వారా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ ప్రోగ్రామ్‌లో తెలంగాణ యాసతో మెప్పించింది. రేలా రే.. పాటతో సెలబ్రిటీ సింగర్‌గా మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో సింగర్‌గా ఫుల్ పాపులర్ అయింది. గువ్వ గోరింక సినిమాతోపాటు నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమాల్లో మెరిసింది. మొత్తానికి ఫిదాలో హీరోయిన్ ఆఫర్ మిస్ చేసుకుందన్న విషయం తెలిసి మంగ్లీ ఫ్యాన్స్ అయ్యో అనుకుంటున్నారు.