ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అని ప్రేయసి ప్రియులను తన్మయత్వానికి గురిచేసినా.. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అని పాటల కానుకను అందించినా.. అది ప్రముఖ సుప్రసిద్ద గాయనీ సునీత (Singer Sunitha) కే సాధ్యం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె పాడిన పాటల జలపాతంలో చాలా మంది తడిసి ముద్దైన వాళ్లు ఉంటారు. ఆమెను స్పూర్తిగా తీసుకొని తమ స్వరాన్ని సరైన శిక్షణతో సవరించుకొని పాటలు పడేందుకు సినీ రంగంలోకి అడుగు పెట్టిన వారూ లేకపోలేదు. ఆమె జీవితం మృదువైన పుష్పాలు పరిచిన పరిమళాల బాట కాదు. జీవితం అనే సంద్రంలో చాలా ఆటుపోట్లు ఎదురైనప్పటికీ చెక్కు చెదరని చిరునవ్వుల ఒడను సాధనంగా చేసుకొని జీవనయానం సాగిస్తున్నారు.
ఫిబ్రవరి 26న హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ (Ilayaraja live music concert) గురించి మాట్లడారు. ‘‘ఈ వేడుక చాలా ప్రత్యేకమైంది. మ్యాస్ట్రో ఇళయరాజా గారికి ప్రస్తుతం ఎనిమిది పదుల వయస్సు ఉంది. కానీ ఆయన వంద దశాబ్థాలకు సరిపడా నిధిని మనకు ఇచ్చారు. నాకు ఈ ఈవెంట్ పాటలు పాడే ఒక సింగర్ గా కాకుండా రాజా గారి వీరాభిమానిగా చాలా ప్రత్యేకమైందన్నారు. అదే సమయంలో ఇళయరాజా కంపోజ్ చేసిన మాటరాని మౌనమిది.. మౌనమేలు రాగమిది అనే పాట గాలిలో అలా ప్రవహించింది. దీంతో ఒక క్షణంపాటూ సునీత ఫ్రీజ్ అయిపోయారు.
సోషల్ మీడియా గురించి కూడా చెప్పుకొచ్చారు. ఇందులో కనిపించేందుకు ప్రత్యేకంగా రెడీ అవ్వను, దీనికంటూ ఒక టైంను కేటాయించనని తెలిపారు. వాలెంటైన్స్ డే గురించి చెబుతూ కేవలం ఈరోజే వాలెంటైన్స్ డే కాదు. ప్రతిరోజూ వాలెంటైన్స్ డే ని జరుపుకోవచ్చన్నారు. అవసరమైతే నేనే రోజాలను తీసుకెళ్లి నా భర్తకు పిల్లలకు ఇస్తానన్నారు. ఎప్పుడూ అబ్బయిలే ఇవ్వాలా గల్స్ కూడా ట్రెండ్ సెట్ చేయండి. లవర్స్, బ్రదర్స్, ఫాదర్స్ ఇలా ఎవరు తమతో బాగా పరిచయం ఉంటే వారికి ఇవ్వండి అంటూ సరదాగా వివరించారు. ఇదే సందర్భంగా సోషల్ మీడియాలో తన ప్రగ్నెన్సీ(Pregnancy)పై వస్తున్న కథనాలకు ఇలా స్పందించారు. ‘‘ నేను ప్రగ్నెంటా.. నాకే తెలియదే. బహుషా ఈ పుకార్లను సృష్టించిన వారి ఆలోచన ఇలా ఉందేమో అని సున్నితంగా తోసిపుచ్చారు.