Sini Shetty: అందం గీసిన బొమ్మ సినీ శెట్టి.. ఇంతకీ ఎవరీమె.. మిస్‌వరల్డ్ వరకు ఎలా వచ్చింది..?

గెలుస్తానని చెప్తే ఎవరూ వినరు.. గెలిచినోడు చెప్తే అంతా వింటారు. సినీ శెట్టి విషయంలో అదే జరిగింది. అందాల పోటీలు అవసరమా అన్న నోళ్లే.. ఇప్పుడు సినీ శెట్టి గెలవాలని దేవున్ని కోరుకుంటున్నాయ్.

  • Written By:
  • Updated On - March 9, 2024 / 08:17 PM IST

Sini Shetty: కలలు కనడం ఏముంది..? ఆ కలల కోసం ఎంత కష్టపడ్డామన్న దానిపై.. సక్సెస్ ఇచ్చే కిక్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫీలింగ్‌కు దాదాపు దగ్గర్లో ఉంది సినీ శెట్టి. నిన్నటివరకు కొందరికే తెలిసిన ఈ పేరు.. ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. మిస్‌ వాల్డ్ పోటీలో.. భారత్ తరఫున ఈ ముద్దుగుమ్మ పాల్గొంటోంది. దీంతో సినీ శెట్టి ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. ఇక్కడివరకు ఎలా వచ్చింది.. ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. ఇలా తెగ సెర్చ్ చేసేస్తున్నారు జనాలంతా !

Kalki 2898 AD: రిలీజ్ డేట్ ఎందుకు లేదు..? ప్రభాస్ ‘కల్కి’ డౌటేనా..?

గెలుస్తానని చెప్తే ఎవరూ వినరు.. గెలిచినోడు చెప్తే అంతా వింటారు. సినీ శెట్టి విషయంలో అదే జరిగింది. అందాల పోటీలు అవసరమా అన్న నోళ్లే.. ఇప్పుడు సినీ శెట్టి గెలవాలని దేవున్ని కోరుకుంటున్నాయ్. తపన, తనని తాను ప్రూవ్ చేసుకోవాలన్న పట్టుదల.. తల్లిదండ్రులు వారించినా, ఫ్రెండ్స్‌ వద్దన్నా.. ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రపంచ వేదికపై భారతీయతను చూపించాలనుకుంది. దానికోసం చాలా కష్టపడింది. ప్రపంచ అందాల కిరీటానికి అడుగు దూరంలో నిలిచింది మంగళూరు బ్యూటీ సినీ శెట్టి. ఈ అందం పుట్టింది మంగళూరులో.. పెరిగిందంతా ముంబైలోనే! నాలుగేళ్లకే భరతనాట్యం నేర్చుకుంది. చదువుల్లోనూ రాణించింది. అకౌంటింగ్‌లో డిగ్రీ చేసిన సినీ శెట్టికి.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. పేరెంట్స్ ఫుల్‌ హ్యాప్పీ. మంచి ప్యాకేజీ. పైగా ప్రమోషన్స్‌. లైఫ్‌ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో.. మోడలింగ్ మీద దృష్టి పెట్టింది. జాబ్ చేస్తూ మోడలింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంది. అక్కడ రాణించడంతో.. పెద్ద పెద్ద కంపెనీలు సినీ శెట్టి ఇంటికి క్యూకట్టాయ్. మోడలింగ్ చేస్తున్న సమయంలో.. మిస్ కర్నాటక పోటీలు ఆమెను ఎట్రాక్ట్ చేశాయ్. ఓసారి ట్రై చేయాలనుకుంది.

ఇంట్లో చెప్తే నిరాశపరిచారు. అక్కడ రాణించడం అంత ఈజీ కాదు.. ఊరుకో అంటూ కొట్టిపారేశారు. ఐనా సినీ శెట్టి పట్టు వదల్లేదు. మిస్ కర్ణాటక కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే మిస్‌ ఇండియా 2022 టైటిల్‌ కూడా సొంతం చేసుకుంది. ఓవైపు కెరీర్‌లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంది. కేన్సర్‌ బాధిత పిల్లల ట్రీట్‌మెంట్ కోసం క్రౌడ్ ఫండింగ్‌ మొదలు పెట్టింది. మిస్‌ వరల్డ్ పోటీల్లో భాగంగా.. ఆశాయే పేరుతో ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. గ్రామాల్లోని యువతకు వ్యక్తిత్త వికాసం శిక్షణతో పాటు ఒకేషనల్ కోర్సులు నేర్పిస్తోంది. తనని ప్రియాంక చోప్రా మాటలు ప్రభావితం చేశాయంటోంది సినీ శెట్టి. లైఫ్‌లో అడ్జెస్ట్ అవ్వొద్దు.. గాజు తెరలను బద్దలు కొట్టడం నేర్చుకోవాలన్న ప్రియాంక చోప్రా మాటలే.. తనని ఇంత దూరం తీసుకొచ్చాయంది. ఆమెలా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలిచి, అందరూ గర్వపడేలా చేస్తానంటోంది సినీ శెట్టి.