Siri Hanumanth: రెమ్యునరేషన్‌లో రష్మీని దాటేసిన సిరి.. ఎంతో తెలిస్తే షాకే..!

లేటెస్ట్‌గా ఈ చిన్నది ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా వచ్చేసింది. అయితే ఈ షో కోసం బ్యూటీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర అభిమానుల మనసు దోచుకుంటున్న జబర్దస్త్ షో కి కొత్త యాంకర్‌గా సిరి వచ్చేసింది.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 02:11 PM IST

Siri Hanumanth: సాధారణ యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీ సిరి (Siri Hanumanth). ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో అమ్మడికి సినిమాల్లో కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి. రీసెంట్‌గానే బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది.

Natural star Nani : ఆడబిడ్డలపై నాని షాకింగ్ కామెంట్స్.. “కంటే కూతుర్నే కనాలి”

ఈ సినిమా ద్వారా ఆమె ఏకంగా పాన్ ఇండియన్ ఆడియన్స్‌కి పరిచయం అయ్యింది. ఈ రేంజ్ వస్తుందని బహుశా సిరి కూడా ఊహించి ఉండదు. ఈ చిత్రంతో పాటుగా ఈమె ఇప్పుడు తెలుగులో కూడా పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తుంది. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్‌గా ఈ చిన్నది ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా వచ్చేసింది. అయితే ఈ షో కోసం బ్యూటీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ (remuneration) హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర అభిమానుల మనసు దోచుకుంటున్న జబర్దస్త్ షో కి కొత్త యాంకర్‌గా సిరి వచ్చేసింది. అయితే ఈ షోకి యాంకర్‌గా ఉన్న రష్మీ  (rashmi) ఒక్కో ఎపిసోడ్‌కి దాదాపుగా రెండు లక్షల రూపాయిలు తీసుకునేదట.

కానీ, ఇప్పుడు సిరి దాదాపుగా మూడు లక్షల 50 వేల రూపాయిలు ఒక్కో ఎపిసోడ్‌కి అందుకుంటుందట. బ్యూటీ క్రేజ్‌ను బట్టి అడిగినంత ఇచ్చేందుకు నిర్వాహకులు ఒప్పుకున్నారట. దీంతో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. యాంకర్ రష్మీని మించిపోయే రేంజ్‌కి సిరి వచ్చేసిందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి.