Sitaramam: సీతారామం బ్యూటీ ఏం చేసిందో తెలుసా..?

మృణాలసేన్ తెలుగులో చేసింది ఒక్కటే సినిమా. ట్రెడిషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా కనిపించింది. రెండో సినిమాకు సైన్‌ చేసింది. ఆ మూవీ ఇంతవరకు సెట్స్‌పైకి రాలేదు కాబట్టి ఎలా వుంటుందో తెలీదు. ఫ్రీ టైంలో అందులో బీచ్‌ అందాలు చూసేసరికి ట్రెండిషన్ని పక్కన పెట్టేయడంతో.. ఈమెను గుర్తు పట్టడం కష్టమే అయింది..

  • Written By:
  • Publish Date - April 9, 2023 / 02:30 PM IST

ఇలా బికినీలో కనిపించింది సీతారామ్‌ బ్యూటీ మృణాలే అంటే నమ్మడం కష్టం. హోమ్లీగా కనిపించి.. ఇలా ఒకేసారి బికినీలో దర్శనమిచ్చేసరికి అందరూ షాక్‌ తిన్నారు. మృణాల్‌ ఠాగూర్‌ ఇండస్ట్రీకి పరిచయమై ఎనిమిదేళ్లయినా.. రాని గుర్తింపు సీతారామం తీసుకొచ్చింది. క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలన్న లక్ష్యంతో ఫస్ట్ మూవీకి 60 లక్షలు తీసుకున్న మృణాల్‌ రెండో సినిమాకు 3 కోట్లు తీసుకుంటోందట.

సీతారామం హిట్‌ తర్వాత తెలుగు చాలా ఆఫర్స్‌ వచ్చాయి. ఇందులో స్టార్స్‌ కూడా వున్నాయి. తన రోల్‌కు ఇంపార్టెన్స్ లేకపోవడంతో వదిలేసుకుంది. ఎట్టకేలకు నాని సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వచ్చేవారం గోవాలో రెగ్యులర్ షూట్‌ మొదలవుతోంది. సీతారామంలో తన క్యారెక్టర్‌ నుంచి ఆడియన్స్‌ను బైటకు తీసుకురావాలనుకుంటోంది మృణాల్‌. ప్యామిలీ హీరోయిన్‌ ముద్ర పర్మినెంట్‌గా పడకుండా… గ్లామర్‌ రోల్స్‌ కూడా చేస్తానని.. సెల్ఫీ మూవీలో అక్షయ్‌ సాంగ్‌తో చెప్పకనే చెప్పేసింది.

మృణాల్‌ కూడా సాయిపల్లవి మాదిరి కథ క్యారెక్టర్‌ బాగుంటేనే సినిమా ఓకె చేస్తుంది. అయితే.. గ్లామర్‌ విషయంలో ఈ ఇద్దరికీ పోలికే లేదు. ఛాన్స్‌ వస్తే… గ్లామర్‌ గుప్పించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడానికే.. ఈ బికినీ ఫోజులు. మరి నాని సినిమాలో ఈ అమ్మడిది గ్లామర్‌ రోలా? లేదంటే.. సీతారామం లాగే మరోసారి ఫ్యామిలీ హీరోయిన్‌ అనిపించుకంటుందో చూడాలి మరి.